Prime9

Plane Crash in USA: అమెరికాలో కూలిన విమానం.. ప్రముఖ సంగీత ఏజెంట్ దుర్మరణం!

Plane Crash in USA: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నివాస ప్రాంతాల్లో ఓ చిన్న విమానం కూలిపోయింది. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతిచెందారు. మరణించిన వారిలో ప్రముఖ సంగీత ఏజెంట్ డేవ్ షాపిరో ఉన్నట్టు స్థానిక అధికారులు గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. విమానం శాన్ డియాగో సిటీకి 10 కి.మీ దూరంలోని మోంట్ గోమెరీ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. కాగా నివాస ప్రాంతంలో విమానం కూలిపోవడంతో కార్లు, ఇళ్లు కాలిపోయాయి.

 

సంగీత ఏజెంట్ డేవ్ షాపిరో సౌండ్ టాలెంట్ గ్రూప్ సంస్థకు కో పౌండర్. స్టోరీ ఆఫ్ ది ఇయర్, పియర్స్ ది వీల్ వంటి రాక్ బ్యాండ్లు ఉన్నాయి. మాజీ డ్రమ్మర్ డేనియల్ విలియమ్స్ కూడా ప్రమాదంలో చనిపోయినట్టు సమాచారం. ప్రమాదంలో మర్ఫీ కాన్యన్ పరిసరాల్లో ఓ ఇల్లు ధ్వంసమైందని.. మరో 10 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. అలాగే కార్లు కూడా ధ్వంసమయ్యాయి. మరోవైపు విమాన ప్రమాదంలో షాపిరోతో పాటు ముగ్గురు ఉద్యోగులు దుర్మరణం చెందినట్టు ఆ కంపెనీ పేర్కొంది. ప్రమాదంలో దర్యాప్తు చేస్తున్నట్టు శాన్ డియాగో అధికారులు తెలిపారు. మరణించిన వారి వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Exit mobile version
Skip to toolbar