Site icon Prime9

Russia school shooting: సెంట్రల్‌ రష్యాలో పాఠశాలపై కాల్పులు.. ఐదుగురు విద్యార్దులు సహా తొమ్మిదిమంది మృతి

Shooting

Shooting

central Russia: సెంట్రల్‌ రష్యాలోని ఓ పాఠశాలపై సోమవారం ఉదయం ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు విద్యార్థులు సహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని ఉద్ముర్తియా ప్రాంత గవర్నర్‌ అలెగ్జాండర్‌ బ్రెచాలోవ్‌ ఓ వీడియో ద్వారా ప్రకటించారు. రాజధాని ఐఝెవ్స్క్‌లోని పాఠశాల పై కాల్పులు జరిపిన దుండగుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 1 నుంచి 11 తరగతుల వారిగా గుర్తించారు. విద్యార్థుల పై కాల్పులకు పాల్పడిన సాయుధుడు తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గవర్నర్‌, స్థానిక పోలీసులు తెలిపారు. పాఠశాలను ఖాళీ చేయించి స్కూళ్లు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. అయితే సాయుధుడు కాల్పులకు పాల్పడేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.

Exit mobile version