Site icon Prime9

Mystery Virus : రష్యాలో అంతుచిక్కని వైరస్‌?

Mystery Virus

Mystery Virus

Mystery Virus : రష్యాలో అంతుచిక్కని వైరస్‌ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. ఆ దేశ ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధి, దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. వైరస్‌ వల్ల దగ్గుతున్న సమయంలో రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. రష్యాలో మిస్టరీ వైరస్‌ విజృంభిస్తోందని గత నెల 29న పలు నివేదికలు వెలువడ్డాయి. పలు నగరాల్లో ప్రజలు జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నాయి. కొవిడ్‌ పరీక్షలు చేసినప్పుడు నెగిటివ్‌ వచ్చిందని, ఇది మరో కొత్త వైరస్‌ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేశాయి.

 

 

ఐదు రోజుల జ్వరంతో బాధపడుతున్న మహిళ..
రష్యా దేశానికి చెందిన అలెగ్జాండ్రా అనే మహిళ 5 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుందని, కొన్ని రోజులకు దగ్గుతున్న సమయంలో రక్తం పడుతున్నట్లు తెలిపిందని నివేదికలు వెల్లడించాయి. మందులు వాడినప్పటికీ తగ్గడం లేదని ఆందోళన వ్యక్తంచేశాయి. అనేక ఇతర కేసుల గురించి వివరించాయి. తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధ పడుతున్నట్లు మరికొందరు నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

 

 

ఖండించిన రష్యా అధికారులు..
నివేదికలను రష్యా అధికారులు ఖండించారు. తాము జరుపుతున్న పరీక్షల్లో దేశంలో ఎలాంటి కొత్తరకం వ్యాధి కారకాలు బయటపడలేదని, నూతన వైరస్‌ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. రకరకాల వదంతులు, తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు. నివేదికల్లో పేర్కొన్న మహిళకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు మైకోప్లాస్మా న్యుమోనియా ఉన్నట్లు నిర్ధరించారని తెలిపారు. కొవిడ్‌ తరహా వైరస్‌ వస్తే దానిని ఎదుర్కోవడానికి తగిన సదుపాయాలు ఉన్నాయని చెప్పారు.

Exit mobile version
Skip to toolbar