Site icon Prime9

Seoul Student: ఆకలితో ఉన్నాడట.. కోటిరూపాయల విలువైన అరటిపండు కళాకృతిని తిన్న సియోల్ విద్యార్ది

Seoul Student

Seoul Student

Seoul Student: ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు, వారు సులభంగా లభించే ఏదైనా తినడానికి సిద్ధంగా ఉంటారు. ఎక్కువ కాలం ఆహారం లభించనందున పచ్చి మాంసం తినే వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే సియోల్ విద్యార్థి తన ఆకలి బాధలను కొంచెం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారుగా కోటిరూపాయలు విలువైన అరటిపండుతో తయారు చేసిన ఒక ఖరీదైన కళాకృతిని సియోల్‌లోని లీయమ్ మ్యూజియం సందర్శించినప్పుడు తిన్నాడు. తాను ఆకలితో ఉన్నందునే ఇలా చేసానని చెప్పాడు.

అరటిపండు తిని తొక్కను అంటించాడు..(Seoul Student)

న్యూయార్క్ పోస్ట్ యొక్క నివేదిక ప్రకారం ఈ కళాకృతిని ప్రసిద్ధ ఆర్ట్ ఇలస్ట్రేషన్‌ను మౌరిజియో కాటెలాన్ అనే ఇటాలియన్ కళాకారుడు సృష్టించాడు. దీనిని లీయం మ్యూజియంలో ప్రదర్శనలో భాగంగా ఉంచారు, మ్యూజియాన్ని సందర్శించిన విద్యార్థి నోహ్ హుయిన్-సూ, గోడకు జోడించిన అరటిపండును బయటకు తీసి తిన్నాడు. అరటిపండు తిన్న తర్వాత దాని తొక్కను మరోసారి గోడకు అతికించాడు. ఈ సంఘటన మొత్తాన్ని అతని స్నేహితుడు రికార్డ్ చేశాడు, తరువాత అతను వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

ఆకలిగా ఉందనే..

అతను అరటిపండును ఎందుకు తిన్నాడని మ్యూజియం అధికారులు ప్రశ్నించగా, తాను అల్పాహారం మానేశానని, అందుకే చాలా ఆకలిగా ఉందని పేర్కొన్నాడు. మరొక ఇంటర్వ్యూలో అతను ఆధునిక కళ యొక్క పనిని దెబ్బతీయడం కూడా ఒక కళాకృతి కావచ్చు అని పేర్కొన్నాడు. అయితే దీనిని తయారు చేసిన కళాకారుడు, మౌరిజియో కాటెలాన్ సదరు విద్యార్ది అరటిపండు తినడం గురించి ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు. మ్యూజియం క్యూరేటర్లు ప్రతి రెండు రోజులకు అరటిపండ్లను మారుస్తారని, ఇది ఆందోళన కలిగించే విషయం కాదని ఆయన అన్నారు.

 

Exit mobile version