Site icon Prime9

Russia: క్రెమ్లిన్‌ భవనాలపై డ్రోన్ల దాడి.. బంకర్‌లోకి పుతిన్‌

Russia

Russia

Russia: రష్యా కీలక భవనాలు ఉండే క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లు దాడికి యత్నించడంతో అధ్యక్షుడు పుతిన్ భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమైంది. దాంతో ముందు జాగ్రత్తగా పుతిన్‌ను తన నివాసంలోని బంకర్‌లోకి తరలించారు. ఆయనకు చెందిన నోవో ఒగరెవో ప్రాంతంలోని నివాసంలో ఈ బంకర్‌ను నిర్మించారు. అధ్యక్షుడు అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని స్థానిక మీడియా తెలిపింది. మరోపక్క ఉక్రెయిన్‌లోని చిన్నారులను రష్యా అపహరించుకుపోయిందనే ఆరోపణలపై కొద్దినెలల క్రితం పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ న్యాయస్థానాన్ని జెలెన్‌స్కీ సందర్శించడం గమనార్హం.

 

అమెరికాకు హెచ్చరికలు(Russia)

రష్యా రాజధాని మాస్కో నడిబొడ్డున క్రెమ్లిన్‌ భవనాలపై రెండు డ్రోన్లు దూసుకురావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రష్యా అధ్యక్ష కార్యాలయం, నివాసం ఉండే ఈ కీలక భవనాలపై డ్రోన్ల దాడికి ప్రయత్నం జరగడంతో రష్యా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై రష్యా.. అమెరికాను తీవ్రంగా విమర్శించింది. క్రెమ్లిన్‌పై జరిగిన డ్రోన్‌ దాడిని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అతడి బృందాన్ని చంపడం తప్ప తమ వద్ద మరో అవకాశం లేదని కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రీ మెద్వదేవ్‌ మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. జెలెన్‌స్కీ బేషరతుగా లొంగిపోయే పత్రంపై సంతకం చేయాల్సిన అవసరం కూడా లేదుని.. ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటుందని మండిపడ్డారు.

 

Revealed: Putin's luxury anti-nuclear bunker for his family's refuge | Marca

 

ఎక్కడెక్కడ దాడి చేయాలో ఆ లక్ష్యాలను అమెరికా ఎంపిక చేస్తుండగా.. వాటిని ఉక్రెయిన్ అమలు చేస్తోందని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ఆరోపించారు. ఆ యత్నాల గురించి రష్యాకు తెలుసని వాషింగ్టన్‌ తెలుసుకోవాలన్నారు. వీటన్నింటికీ ప్రతీకారం తీర్చుకునే హక్కు రష్యాకు ఉందన్నారు. రష్యా దగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయని.. ప్రస్తుత దాడిపై తక్షణ విచారణ జరుగుతోందని అమెరికాకు పెస్కోవ్‌ హెచ్చరికలు చేశారు.

 

Exit mobile version
Skip to toolbar