Site icon Prime9

Red Wine: రోడ్లపై నదిలా ప్రవహించిన రెడ్ వైన్ .. ఎక్కడో తెలుసా ?

Red wine

Red wine

Red Wine: పోర్చుగల్‌లోని సావో లోరెంకో డి బైరో పట్టణంలోని వీధుల్లో రెడ్ వైన్ నదిలా ప్రవహించింది. .పట్టణంలోని నిటారుగా ఉన్న కొండపై నుంచి లక్షలాది లీటర్ల వైన్  వీధుల్లో ప్రవహించడంతో నివాసితులు ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియోలు పట్టణంలో వైన్ నది ప్రవహిస్తున్నట్లు చూపుతున్నాయి.

ట్యాంకులు పేలిపోవడంతో..(Red Wine)

ఈ వైన్ నది పట్టణంలోని లెవిరా డిస్టిలరీ నుండి ఉద్భవించింది, ఇక్కడ 2 మిలియన్ లీటర్ల రెడ్ వైన్‌తో కూడిన బారెల్స్‌ను మోసుకెళ్లే ట్యాంకులు ఊహించని విధంగా పేలిపోయాయి. దీనితో భారీ పరిమాణంలో వైన్ పట్టణంలో ప్రవహించింది.. వైన్ పట్టణంలోని మిగిలిన ప్రాంతాలకు వెళ్లే ముందు డిస్టిలరీకి సమీపంలో ఉన్న ఒక ఇంటిలోని నేలమాళిగను కూడా ముంచెత్తింది. వైన్ వరదను ఆపడానికి అగ్నిమాపక విభాగం చర్యలు చేపట్టింది. వరదను దారి మళ్లించి సమీపంలోని పొలాల్లోకి ప్రవహించేలా చేశారని న్యూయార్క్ పోస్ట్ నివేదిక తెలిపింది.

మరోవైపు దీనికి కారణమయిన లెవిరా డిస్టిలరీ విచిత్రమైన సంఘటనకు క్షమాపణలు చెప్పింది. పట్టణంలోని వైన్ తో తడిసిన భూమిని డ్రెడ్డ్ చేసినట్లు హామీ ఇచ్చింది. వైన్ ప్రవహించడంతో జరిగిన డ్యామేజీని శుభ్రపరచడం మరియు మరమ్మత్తు చేయడంతో సంబంధం ఉన్న ఖర్చులకు మేము పూర్తి బాధ్యత వహిస్తాము అని డిస్టిలరీ ఒక ప్రకటనలో తెలిపింది.

Exit mobile version