Site icon Prime9

Fitch Rating: యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను AA+కి తగ్గించిన రేటింగ్ ఏజెన్సీ ఫిచ్

Fitch Rating

Fitch Rating

 Fitch Rating:ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు బుధవారం నాడు వణికిపోయాయి.మనదేశంలో స్టాక్‌ మార్కెట్లు ఇంట్రాడేలో 1,000 పాయింట్ల వరకు నష్టపోయి.. మార్కెట్‌ ముగిసే సమయానికి కాస్తా కోలుకుని 700 పాయింట్ల నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపద 3.65 లక్షల కోట్లు హారతి కర్పూరం అయ్యింది. గ్లోబల్‌ మార్కెట్లు కుప్పకూలడానికి ప్రధాన కారణం రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ను AAA నుంచి AA+కు కుదించడం.  అయితే ఔట్‌లుక్‌ స్థిరంగా ఉంటుందని తేల్చి చెప్పింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు అవాక్కయ్యారు. అగ్రరాజ్యం రేటింగ్‌ను కుదించారనే సరికి ఎవరైనా షాక్‌ గురవుతారు. ఇక వైట్‌ హౌస్‌ఫిచ్‌ రేటింగ్‌పై దుమ్మెత్తి పోసింది. యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ జనెట్‌ యెల్లెన్‌ మాత్రం ఫిచ్‌ ఔట్‌డెటెడ్‌ డేటాను తీసుకుని విశ్లేషించి రేటింగ్‌ను కుదించిందని ఒక ప్రకటనలో సీరియస్‌నెస్‌ను తగ్గించడానికి ప్రయత్నించారు.

అమెరికా డిఫాల్ట్‌ అయ్యే అవకాశం..( Fitch Rating)

ఫిచ్‌ రేటింగ్‌ విచిత్రమైన ఎలాంటి ఆధారం లేకుండా నిర్ణయం తీసుకుందని యెల్లెన్‌ వ్యాఖ్యానించారు. ఇండియా మాదిరిగానే తప్పు తమది కాదు ఇంతకు ముందు ప్రభుత్వం నడిపిన ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్‌ పార్టీదని బైడెన్‌ సర్కార్‌ నెపాన్ని పాత ప్రభుత్వంపై నెడుతోంది. బైడెన్‌ సర్కార్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌పై మండిపడుతుంటే.. ఫిచ్‌ మాత్రం రేటింగ్‌కుదించడానికి గల కారణాలు వివరించి చెబుతోంది. దీర్ఘకాలంలో అమెరికా డిఫాల్ట్‌ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వచ్చే మూడేళ్లో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవుతుందని, ప్రభుత్వానికి అప్పుల భారం మరింత పెరుగుతుందని తేల్చి చెప్పింది. గత రెండు దశాబ్దాల నుంచి ప్రభుత్వం విచ్చల విడిగా వ్యయం చేసిందని.. అదీ కాకుండా ప్రస్తుతం ఉన్న బైడెన్‌ ప్రభుత్వం రుణ పరిమితి పెంచాలని సెనెట్‌లో బిల్లు పెట్టింది. దీనికి రిపబ్లికన్‌లు అడ్డుతగిలారు. చివరి నిమిషంలో రుణ పరిమితి పెంచుకోవడానికి రిపబ్లికన్లు అనుమతించడంతో గండం నుంచి గట్టెక్కారు. లేదంటే డిఫాల్ట్‌ అయ్యే చాన్స్‌ ఉండేది.

అయితే క్రెడిట్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడానికి ప్రధాన కారణం. ఫైనాన్షియల్‌ స్కోరోబోర్డ్‌ బలహీనంగా ఉండటమే కారణంగా చెబుతారు. కాగా కంపెనీలు కానీ.. ప్రభుత్వాలు కానీ తీసుకున్న రుణాలు ఎలా చెల్లిస్తారో దాని ప్రకారమే రేటింగ్‌ ఇస్తారు. ఒక వేళ కంపెనీ కానీ, ప్రభుత్వం రేటింగ్‌ డౌన్‌ గ్రేడ్‌ అయితే.. వారి ఆర్థికపరిస్థితి దారుణంగా ఉందని అర్దం చేసుకోవాల్సిందే. అలాంటి వారికి రుణం ఇస్తే తిరిగి వసూలు చేసుకోవడం కష్టమే అని అర్ధం. అయితే ఒక్కో రేటింగ్‌ ఏజెన్సీ ఒక్కోవిధంగా అధ్యయనం చేసి రేటింగ్‌ ఇస్తుంటాయి. అయితే ఆర్థిక నిపుణుల ప్రకారం ఫిచ్‌ రేటింగ్‌ విషయానికి వస్తే AAA ది బెస్ట్‌ అని అదే AA+ కూడా హై క్వాలిటినే అని చెబుతున్నారు. అయినా అమెరికా క్రెడిట్‌ వర్తినెస్‌ ఇంకా బలంగానే ఉందని చెబుతున్నారు నిపుణులు.

ఆర్థికపరమైన క్రమశిక్షణ లేదు..

ఫిచ్‌ అంచనా ప్రకారం గత 20 సంవత్సరాల నుంచి అమెరికాలో స్టాండర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌… పరిపాలన దిగజారిపోయిందని.. అలాగే ఆర్థికపరమైన అంశాల్లో కూడా క్రమశిక్షణ పాటించలేదని తేల్చి చెప్పింది. రాజకీయ కారణాలతో ప్రతి ఏడాది రుణ పరిమితి పెంచుకుంటూ పోతోందని తెలిపింది. కాగా మధ్యకాలికానికి ఆర్థికపరమైన అంశాలపై పటిష్టమైన రోడ్‌మ్యాప్‌ కూడా లేదని తెలిపింది. ఇవే కాకుండా పలు రకాల ఆర్థికపరమైన అంశాల్లో తప్పటడుగులు వేసింది. ఒక వైపు పన్నులు తగ్గించడం.. మరోవైపు ప్రభుత్వం వ్యయం పెంచుకుంటూ పోతోంది. గత రెండు దశాబ్దాల నుంచి రుణ పరిమితి పెంచుకుంటూపోతోంది. అయితే మధ్యకాలికానికి ఆర్థిక పరిమైన సవాళ్లను ఎదుర్కొవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని వివరించింది. ముఖ్యంగా సోషల్‌ సెక్యూరిటి… మెడికల్‌ వ్యయంపై అతి పెద్ద సవాళ్లను ఎదుర్కొనబోతోంది. దేశంలో వయసు పెరిగిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

ఇక ద్రవ్యలోటు విషయానికి వస్తే 2023లో ద్రవ్యలోటు జీడీపీలో 6.3 శాతానికి చేరుతుందని.. గత ఏడాది 3.7 శాతంగా నమోదైంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ తగ్గడంతో పాటు అదే సమయంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యయం చేయడం … దీంతో పాటు అధికవడ్డీ చెల్లించి రుణాలు సేకరించడంతో ద్రవ్యలోటు పెరిగిపోతోంది. కాగా 2024 నాటికి ద్రవ్యలోటు జీడీపీలో 6.6 శాతానికి 2025 నాటికి ఇదికాస్తా 6.9 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేసింది. ద్రవ్యలోటు పెరగడంతో దాని ప్రభావం జీడీపీపై కనిపిస్తుంది. కాగా డెట్‌ టు జీడీపీ రేషియా 2025 నాటికి 118.4 శాతానికి చేరుకోవచ్చునని ఫిచ్‌ అంచనా వేసింది. వచ్చే దశాబ్దం నాటికి అమెరికా భారీగా తెచ్చుకున్న రుణాలపై అధిక వడ్డీరేట్లు చెల్లించాల్సిన ఆగత్యం ఏర్పడుతుంది. దీంతో పాటు అమెరికాలో వయసు పైబడిన వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. దీంతో హెల్త్‌కేర్‌పై ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యయం చేయాల్సి రావచ్చునని ఫిచ్‌ నివేదికలో వివరించింది.

Exit mobile version