Brazil Rains: బ్రెజిల్‌లోని దక్షిణాది రాష్ట్రమైన రియో గ్రాండే డో సుల్‌లో భారీ వర్షాలకు 39 మంది మరణించగా 74 మంది గల్లంత యినట్లు స్థానిక అధికారులు తెలిపారు, మరికొన్ని తుఫాను ప్రభావిత ప్రాంతాలనుంచి సమాచారం రావలసి వున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రియో గ్రాండే డో సుల్ గవర్నర్ ఎడ్వర్డో లైట్ తెలిపారు.
రోడ్లు, వంతెనలు ధ్వంసం..(Brazil Rains)
అనేక పట్టణాలలో, రోడ్లు మరియు వంతెనలు ధ్వంసమై వీధులునదులుగా మారాయి. తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఒక జలవిద్యుత్ కేంద్రం వద్ద డ్యామ్ నిర్మాణం పాక్షికంగా కూలిపోయింది. బెంటో గోన్‌కాల్వ్స్ నగరంలోని రెండవ ఆనకట్ట కూడా కూలిపోయే ప్రమాదం ఉందని, సమీపంలో నివసించే ప్రజలను ఖాళీ చేయమని అధికారులు ఆదేశించారు.వాతావరణ మార్పుల కారణంగా తీవ్రమైన వర్షాలు మరియు ఇతర కరువు పరిస్దితులు ఏర్పడుతున్నాయని స్దానిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.గత సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కారణంగా వరదలు సంభవించి 50 మందికి పైగా మరణించారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా గురువారం రాష్ట్రానికి వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, గవర్నర్‌తో సహాయక చర్యల గురించి చర్చించారు.