Paris protesters: పారిస్‌కు దక్షిణాన ఉన్న పట్టణంలోని మేయర్ ఇంటిపైకి కారు దూసుకువెళ్లడంతో అతని భార్య మరియు పిల్లలలో ఒకరికి గాయపడ్డారు. మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ తన ఇంటిపై నిరసనకారులు దాడి చేశారని చెప్పారు. ట్విట్టర్ పోస్ట్‌లో, తనకు మరియు అతని కుటుంబానికి హాని కలిగించే ప్రయత్నంలో, నిరసనకారులు తన ఇంటిపై దాడి చేసారని తెలిపారు.
మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ మాట్లాడుతూ, అతని కుటుంబం నిద్రిస్తున్నప్పుడు నిరసనకారులు నిప్పు పెట్టడానికి ముందు అతని ఇంటిపైకి కారుతో దూసుకెళ్లారని చెప్పారు.నా భార్య మరియు నా పిల్లలలో ఒకరు గాయపడ్డారని తెలిపారు. ఇది చెప్పలేని పిరికితనం యొక్క హత్యాయత్నంగా ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్స్ అంతటా వ్యాపిస్తున్న అల్లర్ల నేపధ్యంలో ఐదవరోజు రాత్రి ఈ ఘటన జరిగింది. నిరసనకారులు పలు కార్లకు నిప్పంటించారు. మౌళిక సదుపాయాలపై దాడి చేసారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోవడానికి యత్నిస్తున్న 17 ఏళ్ల బాలుడిని పోలీసులు కాల్చి చంపడంతో అల్లర్లు ప్రారంభమయిన విషయం తెలిసిందే.
అల్లర్లు, హింసాత్మక ఘటనల నేపధ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శనివారం తన జర్మనీ పర్యటనను వాయిదా వేసుకున్నారు.అంతర్గత మంత్రిత్వ శాఖ 45,000 మంది పోలీసు అధికారులను మరియు సాయుధ వాహనాలను మోహరించింది. అయితే సోషల్ మీడియా ద్వారా సంఘటితమయ్యే యువకులతో కూడిన ముఠాలు, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విధ్వంసం, దుకాణాలను లూటీ చేయడం మరియు టౌన్ హాళ్లపై దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాయి.రాత్రిపూట 1,350 వాహనాలు, 234 భవనాలు తగలబడిపోయాయని, బహిరంగ ప్రదేశాల్లో 2,560 అగ్నిప్రమాదాలు జరిగినట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం తెలిపింది.దేశవ్యాప్తంగా 1,311 మందిని పోలీసులు అరెస్టు చేశారు.