PM Modi Meet Trump, approves extradition mumbai terror attack accused Tahawwur to India: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇరువురు భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌లో భాగంగా ఇరువురు చర్చలు జరిపారు. అంతకుముందు ప్రధాని మోదీ పలువురితో భేటీలు నిర్వహించారు. ఈ మేరకు ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ అనంతరం ఓ సంచలన ప్రకటన వెల్లడించారు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్న తహవూర్ రాణా అమెరికాలో హై సెక్యూరిటీ జైలులో ఉన్నారు. అయితే అతడిని అప్పగించాలని చాలా కాలంగా భారత్ కోరుతుంది. ఇందులో భాగంగానే ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాను అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఒకదేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని చెప్పారు. ఈ విధానం ప్రపంచ దేశాలన్నింటికీ మోదీ పేర్కొన్నారు. కాగా, అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపిన విషయం తెలిసిందే.
ముంబై పేలుళ్ల సూత్రధారుడు తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగించడానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రర్ కు వ్యతిరేకంగా ఇండియా పోరాటానికి ట్రంప్ మద్దతు ప్రకటించారు. 26/11 మంబై పేలుళ్ల సూత్రధారుల్లో రాణా ఒకడు. ప్రస్తుతం లాస్ ఏంజిలెస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ప్రధానమంత్రి మోదీ వైట్ హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో భేటీలో రాణాను ఇండియాకు అప్పగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అంతే కాకుండా ఇండియా అమెరికా కలిసి గతంలో ఎన్నడూ లేని విధంగా కలిసి కట్టుగా రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజాన్ని కూకటి వ్రేళ్లతో పెకిలించి వేయడానికి కలిసి పనిచేస్తాయన్నారు. ఇస్లామిక్ టెర్రరిజం యావత్ ప్రపంచానికి ముప్పుగా పరిణమించిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగిస్తున్నందుకు సంతోషంగా ఉందని వైట్ హౌస్‌లో ట్రంప్ చెప్పారు. ప్రపంచంలోని అత్యంత కరుడుగట్టినవారిలో ఒకరైన రాణాను భారత్‌కు అప్పగిస్తున్నాను. 2008 ముంబై టెర్రర్‌దాడుల సూత్రధారుల్లో ఒకరైన రాణాను అప్పగిస్తున్న.. దీంతో ఆయన అక్కడ కోర్టులో విచారణకు ఎదుర్కొవాల్సి వస్తుందని ట్రంప్ మోదీ ఇద్దరు కలిసి మీడియా సమావేశంలో వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో మరింత మంది టెర్రరిస్టులను బారత్‌కు అప్పగించే అవకాశాలున్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్టులు కూడా అమెరికాను అడ్డా చేసుకొని ఇండియన్స్‌పై దాడులు చేస్తున్నారు. వారిలో చాలా మంది ఇండియాలో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు.
రాణా విషయానికి వస్తే పాకిస్తాన్ జాతీయుడు కానీ కెనడా పౌరసత్వం తీసుకున్నాడు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ఆయన ప్రమేయం కూడా ఉంది. 2008లో జరిగిన ఈ టెర్రర్ దాడుల్లో సుమారు 166 మంది అమాయకుల ప్రాణాలు గాల్లోకి కలిసిపోయాయి. పాకిస్తాన్‌కు చెంది పది మంది టెర్రరిస్టులు ముంబైలో చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వారిలో తొమ్మిది మందిని భారత భద్రతాదళాలు చంపేస్తే. మిగిలిన ఒక్క టెర్రరిస్టు అజ్మల్ కసబ్‌ను బందీగా పట్టుకున్నారు. తర్వాత 2012లో ఆయనకు ఉరిశక్ష పడిన విషయం తెలిసిందే. గత నెల భారత విదేశాంగమంత్రిత్వశాఖ ..అమెరికాలో తలదాచుకున్న నేరస్తులను భారత్‌కు అప్పగించాలని కోరుతామని తెలిపింది. ప్రధానంగా రాణాను అప్పగించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతామని పేర్కొంది. కాగా తనను ఇండియాకు అప్పగిస్తారని తెలుసుకున్న రాణా గత నెల 21న అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. పిటిషన్‌ను అక్కడి ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇండియా అప్పగించకుండా చేసిన చివరి ప్రయత్నం విఫలం అయ్యింది.
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం రాణా అప్పగింతకు ఆమోదం తెలిపిన 24 గంటల్లోనే రాణాను ఇండియాకు అప్పగిస్తారు. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ దర్యాప్తు ఏజెన్సీకి చెందిన ఐదుగురు ఉన్నతాధికారుల బృందం వెంటనే అమెరికాకు బయలు దేరి వెళతారు. అమెరికా ప్రభుత్వం అప్పగింత కాగితాలపై సంతకాలు పెట్టిన వెంటనే ఇండియా నుంచి ఎన్‌ఐఏ అధికారులు వెళ్లి రాణాను ఇండియాకు తరలిస్తారు. ఇక రాణా విషయానికి వస్తే లాస్ ఏంజిలెస్‌లోని ఓ డిటెన్షన్ సెంటర్‌లో బంధించారు. ఇక ఇండియా నుంచి ఐదుగురు ఉన్నతాధికారుల బృందం అమెరికాకు వెళ్తుంది. వారిలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ర్యాంకు అధికారి ఒకరుంటారు. ఆయన రాణాను ఇండియాకు రప్పించేందకు కావాల్సిన ఏర్పాట్లను వ్యవహారాలను దగ్గరుండి చూస్తారు. ఇదిలా ఉండగా ఢిల్లీలోని తిహార జైలు కాంప్టెక్స్‌లో రాణా కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ర్తి చెప్పారు. ఇరు దేశాలకు చెందిన అధికారులు రాణాను అమెరికా నుంచి ఇండియాకు ఎలా రవాణా చేయాలనే అంశంపై పెద్ద ఎత్తు కసరత్తు చేస్తున్నారు. ఇక తహవ్వుర్ రాణా విషయానికి వస్తే పాకిస్తాన్ ఆర్మీలో ఆయన మాజీ డాక్గర్. అటు తర్వాత ఆయన 1997లో కెనడాకు వలస వెళ్లారు. అటు తర్వాత ఆయన అక్కడి నుంచి అమెరికా వెళ్లి అక్కడి ఇమ్మిగ్రేషన్ కంపెనీని స్థాపించాడు. దీని వెనుక అసలు ఉద్దేశం లష్కర్ ఏ తైబా టెర్రరిస్టు డేవిడ్ హెడ్లీ ఫ్రంట్ ఆఫీసుగా చేసుకొని తన కార్యకలాపాలు నిర్వహించేవాడు. అయితే 2011లో హెడ్లీ టెర్రరిస్టు కార్యకలాపాలల్లో పాలుపంచుకున్నకేసులో సహ నిందితుడిగా శిక్ష పడి తర్వాత జైలు నుంచి నిర్దోషిగా విడుదల అయ్యాడు.
హాడ్లీకి ఒక కేసులో శిక్ష పడితే.. మరో కేసులో రాణాకు కూడా శిక్ష పడింది. ఇక రాణా విషయానికి వస్తే డానిష్ న్యూస్ పేపర్‌పై దాడికి కుట్ర పన్నాడని ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కోవిడ్ 19 సమయంలో మానవతా దృక్పథం కింద రాణాను విడుదల చేశారు. అటు తర్వాత న్యూఢిల్లీ 2023లో రాణాను భారత్‌కు అప్పగించాలని కోరడంతో అమెరికా అధికారులు మరోమారు రాణాను అరెస్టు చేశారు. కాగా అమెరికా కోర్టు భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయాన్ని రాణా లాయర్లు యూఎస్ సుప్రీంకోర్టులో నవంబర్ 2024లో సవాలు చేశారు. కాగా ప్రధానమంత్రి మోదీ రెండు రోజుల అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా ట్రంప్ రాణా భారత్‌కు అప్పగింత ప్రకటన చేశారు. మోదీ అమరికాకు రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. అమెరికా పర్యటనలో మోదీ ట్రంప్ పలు అంశాల గురించి చర్చించుకున్నారు. ఇంటర్నేషనల్ టెర్రరిజాన్ని రూపుమాపడానికి ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. మొత్తానికి ముంబై టెర్రర్ దాడుల బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు మాత్రం మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి మోదీ అమెరికా పర్యటన సక్సెస్ అని చెప్పుకోవాల్సిందే.