Pig kidney in Human body: బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన వ్యక్తిలో పంది కిడ్నీ సాధారణంగా రెండు నెలలపాటు పనిచేసి రికార్డు సృష్టించింది.NYU లాంగోన్ హెల్త్‌లో ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అయిన డాక్టర్ రాబర్ట్ మోంట్‌గోమెరీ నేతృత్వంలోని ఈ ప్రయోగం బుధవారం ముగిసింది, పంది కిడ్నీని తొలగించి, మారిస్ “మో” మిల్లర్ అనే వ్యక్తి మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం అతని కుటుంబానికి తిరిగి పంపించారు.జన్యుపరంగా మార్పు చెందిన పంది కిడ్నీ మానవునిలో పనిచేసిన సుదీర్ఘ కాలంగా ఇది గుర్తించబడింది.
అవయవ కొరత పరిష్కారానికి..(Pig kidney in Human body)
డాక్టర్ మోంట్‌గోమెరీ, స్వయంగా గుండె మార్పిడి గ్రహీత. యూఎస్ అవయవ కొరతను పరిష్కరించడానికి జంతువుల నుండి మనిషికి మార్పిడి చేయడం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 1,00,000 మందికి పైగా ప్రజలు అవయవాల కోసం జాతీయ నిరీక్షణ జాబితాలో ఉన్నారు, వీరిలో చాలా మందికి కిడ్నీ అవసరం.ఈ ప్రయోగంలో పంది కిడ్నీ ఎలా పనిచేస్తుందో పరిశీలించడానికి మిల్లర్ శరీరాన్ని వెంటిలేటర్‌పై రెండు నెలల పాటు నిర్వహించడం జరిగింది.మిల్లర్ కుప్పకూలిపోయి బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించబడ్డాడు, క్యాన్సర్ కారణంగా తన అవయవాలను దానం చేయలేక పోయాడు. అతని సోదరి, మేరీ మిల్లర్-డఫీ, పిగ్ కిడ్నీ ప్రయోగం కోసం అతని శరీరాన్ని దానం చేయాలని నిర్ణయం తీసుకుంది.
జూలై 14న, అతని 58వ పుట్టినరోజుకు కొద్దికాలం ముందు, సర్జన్లు మిల్లర్ యొక్క స్వంత మూత్రపిండాలను ఒక పంది కిడ్నీతో మరియు జంతువు యొక్క థైమస్ అనే గ్రంథితో మార్పిడి చేసారు. మొదటి నెలలో, కిడ్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేసింది. ఈ ప్రయోగం జెనోట్రాన్స్‌ప్లాంటేషన్, జంతు అవయవాలను మానవులకు మార్పిడి చేయడంపై భవిష్యత్తు ఆశను పెంచింది.