German branch of PETA: స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా మాంసం తినడం ద్వారా వాతావరణ విపత్తుకు కారణమవుతున్నారని కనుగొన్న ఒక అధ్యయనం ఆధారంగా ’పెటా‘ (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) మాంసాహారాన్ని తినే పురుషుల పై సెక్స్ స్ట్రైక్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా మహిళలను కోరుతోంది. మాంసాహారం తినే పురుషులపై స్త్రీలు లైంగిక నిషేధం విధించడం వలన “ప్రపంచం కాపాడబడుతుంది” మరియు “విషపూరితమైన మగతనం” అరికడుతుందని సంస్థ విశ్వసించింది.
సెక్స్ స్ట్రైక్‌కు పిలుపునిస్తూ ఒక ప్రకటనలో పెటా ఇలా పేర్కొంది. ప్లోస్ వన్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, వాతావరణ విపత్తుకు మహిళల కంటే పురుషులే ఎక్కువగా దోహదపడుతున్నారు. ప్రధానంగా మాంసం వినియోగం ద్వారా వారి ఆహారపు అలవాట్లు 41 శాతం ఎక్కువ గ్రీన్‌హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తాయి. పురుషులు తమ చర్యలకు జవాబుదారీతనం వహించాలని తెలిపింది. మనందరికీ తెలుసు సబర్బన్ పురుషులు చేతిలో బీర్ సీసాలు, ఖరీదైన గ్యాస్ గ్రిల్స్ పై మాంసం ముక్కలు వండేటప్పుడు పటకారులు కొడుతూ ఉంటారు. ప్రజలు తమ మాంసాన్ని కాల్చడానికి బార్బెక్యూని ఉపయోగించడం తమకు మరియు వారి తోటి మానవులకు తమ మగతనాన్ని నిరూపించుకోవడానికి వారి ప్రయత్నాలు. ఇది జంతువులను మాత్రమే కాకుండా గ్రహానికి కూడా హాని కలిగిస్తుందని ’పెటా‘ తెలిపింది
’పెటా‘ జర్మనీ శాఖ నుండి డేనియల్ కాక్స్, విషపూరితమైన మగతనం వాతావరణానికి హాని కలిగిస్తుంది. పురుషులు ఉత్పత్తి చేసే కార్బన్ ఫుట్‌ప్రింట్, మాంసం తినే శాతానికి అనుగుణంగా వారిపై 41 శాతం మాంసం పన్నువిధించాలని అన్నారు.