Pakistan Train Hijacked: పాకిస్థాన్‌లో రైలు హైజాక్ కలకలం రేపుతోంది. బలుచిస్థాన్ రెబల్ గ్రూప్ ట్రైన్‌ను హైజాక్ గురైంది. పాక్ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను (Jaffar Ecpress) పట్టాలు తప్పించి అదుపులోకి తీసుకుని ప్రయాణికులకు కిడ్నాప్ చేశారు. మొత్తం ప్రయాణికుల్లో సుమారు 100 మంది ప్యాసింజర్స్ బంధించినట్టు స్థానిక మీడియలో పేర్కొంది. బంధించిన వారిలో ఆరుగురు ఆపక్ జావాన్లను హతమార్చినట్టు సమాచారం. హైజాక్ అనంతరం ఈ రెబల్ గ్రూప్ ఓ ప్రకటన చేసింది.
ఈ ప్రకటన మేరకు.. జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ని హైజాక్ చేశాం, అందులోని దాదాపు 100 మంది ప్రయాణికులను బంధించినట్టు తెలిపింది. వారిలో పాక్ సైన్యం, పోలీసులు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ యాక్టివ్ డ్యూటీ సిబ్బంది ఉన్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. వీరందరూ సెలవుపై పంజాబ్ ప్రయాణిస్తున్నారు. ఈ విషయంలో పాకిస్థాన్ సైన్యం జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తే బంధీలందరిని ఊరి తీస్తామని హెచ్చరించింది.
కాగాపాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్లా నుంచి పెషావర్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాకు మీదుగా తొమ్మిది బోగీలలో 450 మంది ప్రయాణికులతో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణిస్తుంది. అదే సమయంలో బలుచిస్తాన్ సమీపంలో బలూచిస్తాన్ వేర్పాటు వాదులు ట్రెన్ హైజాక్‌కు ప్లాన్ వేశారు. ఈ క్రమంలో రైలుపై కాల్పులు జరిపి అనంతరం హైజాక్ చేసినట్టు రైల్వే అధకారులు తెలిపారు.