Prime9

Pakistan Stock Market: ‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్.. కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్

Pakistan Stock Market Down due to Indian Army Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇన్ని రోజులుగా వ్యూహాత్మకంగా, వాణిజ్య, దౌత్య పరంగా దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సిందూర్ పేరుతో ఇవాళ అర్ధరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావారాలే లక్ష్యంగా వైమానిక దాడులు జరిపింది.దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మాద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు ముష్కరులను హతం చేసింది.

 

ఇదిలా ఉండగా.. భారత్ సైన్యం జరిపిన దాడులతో పాకిస్తాన్ స్టార్ మార్కెట్లు కుప్పకూలాయి. అసలే ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటూ.. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ బిచ్చమెత్తుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ మార్కెట్ సూచీలు దారుణంగా పడిపోయాయి. కరాచీ- 100 స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు 6,272 పాయింట్లు పడిపోయి 4.62 శాతమేర సూచీలు క్షీణించి.. 1,07,296 పాయింట్లకు చేరుకుంది. అయితే పహల్గామ్ దాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ సూచీలు నష్టపోతూనే ఉన్నాయి. అక్కడి మార్కెట్లు దాదాపు 3.7 శాతం మేర క్షీణించాయి. ఇప్పటివరకు అక్కడి మార్కెట్లు మొత్తం 9,930 పాయింట్లు అంటే 6 శాతం మేర పాయింట్లు నష్టపోయినట్టు సమాచారం.

 

కానీ భారత సైన్యం జరిపిన దాడుల ఎఫెక్ట్ భారత స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం పడలేదు. ప్రారంభంలో ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ ఓ దశలో 80,844 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకగా.. ఇంట్రా డేలో 79,937 పాయింట్లకు చేరుకుంది. మరోవైపు నిఫ్టీ కూడా లాభాల్లో పయనించింది.

Exit mobile version
Skip to toolbar