Site icon Prime9

Japan: జపాన్ పై ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం…హింసాత్మక ప్రవర్తనగా పేర్కొన్న జపాన్

https://prime9news.com/international-news

https://prime9news.com/international-news

North Korea: అణ్వాయిద దేశంగా ప్రకటించుకొన్న ఉత్తర కొరియా తన దూకుడును పెంచింది. గడిచిన వారం రోజుల్లో వివిధ ప్రాంతాలపైకి 4 క్షిపణి ప్రయోగాలు చేపట్టిన ఉత్తర కొరియా మరోసారి జపాన్ పై క్షిపణి ప్రయోగించి ఆంక్షలు భేఖాతరంటూ ప్రవర్తించింది.

భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం 7.23గంటలకు జపాన్ పైకి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా చేపట్టింది. రాడారు వ్యవస్ధ ద్వారా సమాచారం తెలుసుకొన్న జపాన్ ప్రజలను అప్రమత్తం చేసింది. హెుక్కైడో ద్వీపం మీదుగా క్షిపణి ప్రయోగం జరగడంతో ప్రజలను అప్రమత్తం చేసారు.

ఉత్తర కొరియా ఒక మిస్సైల్ ప్రయోగించినట్లుంది. ప్రజలంతా భవనాల లోపలికి కానీ, భూగర్భ షెల్టర్లలోకి కానీ వెళ్లండి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ఇలాంటి హెచ్చరికలు రావడం చాలా అరుదు.

కొన్ని రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా ప్రభుత్వం రద్దు చేసింది. ఉత్తర కొరియాపై ఆంక్షలు కొరడా ఉన్నప్పటికీ ఆ దేశం పలు క్షిపణి ప్రయోగాల చేపట్టి ప్రజల జీవితాలతో ఆటలాడుకొంటుంది. జపాన్ టీవీ స్టేషన్లు బ్రేకింగ్ న్యూస్ పేరుతో ప్రజలను అప్రమత్తం చేశారు. గతంలో బాలిస్టిక్, న్యూక్లియర్ ఆయుధ పరిక్షలు జరపకుండా ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి నిషేదం విధించిన తర్వాత కూడా క్షిపణి దాడులు జరగడంతో జపాన్ ప్రధాన మంత్రి పుమియో కిషిడా తీవ్రంగా ఖండించారు. జపాన్ పై చేపట్టిన క్షిపణి ప్రయోగాన్ని హింసాత్మక ప్రవర్తనగా అభివర్ణించారు.

ఘటనపై జాతీయ భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు జపాన్ ప్రకటించింది. 2006 నుండి 2017 మద్యకాలంలో ఉత్తర కొరియా ఆరుసార్లు అణుపరిక్షలు జరిపింది. శనివారం రెండు రాకెట్లు జపాన్ ప్రత్యేక ఎకనామిక్ జోన్ బయట జలాల్లో పడ్డాయి. తాజాగా చేపట్టిన ప్రయోగంతో జపాన్ గగనతలం మీదుగా దూసుకొళ్లిన క్షిపణి 3వేల కి.మీ దూరంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఈ మిస్సైల్ పడిన్నట్లు ప్రభుత్వం పేర్కొనింది.

ఘటనపై అమెరికా తూర్పు, ఆసియా దౌత్యవేత్త డానియల్ క్రిటెన్ బ్రింక్ స్పందిస్తూ, ఉత్తర కొరియా నిర్ణయం దురదృష్టకరంగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Nobel Prize :వైద్యశాస్త్రంలో స్వాంటె పాబో కు నోబెల్ ప్రైజ్

Exit mobile version