Nicaragua: నికరాగ్వాలో ప్రతి సంవత్సరం, ప్రజలు ఒక విచిత్రమైన ఆచారంలో పాల్గొంటారు. దీనిలో వారు ఒకరినొకరు ఎండిన ఎద్దు పురుషాంగాలతో తయారు చేసిన కొరడాతో కొట్టుకుంటారు. వారు పశ్చాత్తాపం చెందే వరకు వారి ప్రత్యర్థులను కొరడాతో కొడుతుంటారు.
పాపాలకు ప్రాయశ్చిత్తంగా..(Nicaragua)
నికరాగ్వాలోని శాన్ జువాన్ డి ఓరియంటే మున్సిపాలిటీలో, సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ గౌరవార్థం చినెగ్రోస్” నృత్యం అని పిలువబడే ఈ ఆచారంలో ఎటువంటి రక్షణ పరికరాలు ధరంచకుండా కొన్నిసార్లు పాక్షికంగా దుస్తులు ధరించకుండా ఉంటారు. దీనిని ఒకరి పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం లేదా పోషకుడి పట్ల భక్తిని ప్రదర్శించే సాధనంగా భావిస్తారు.ధైర్యం మరియు ఓర్పును ప్రదర్శించడానికి ఒక అవకాశంగా కూడా భావిస్తారు.
ఈ కొరడా శరీరాన్ని తాకినపుడు చర్మం చిట్టిపోతుంది. శరీరంలో కోతలు, మచ్చలతో కనపడే వారు చాలా మంది ఉంటారు. అయితే ఇది తమ శతాబ్దాలనాటి మతాచారమని పలువురు చెబుతుండటం విశేషం. కొంతమంది చరిత్రకారులు ఆచారం యొక్క పేరును ఆఫ్రికన్ బానిసలతో పరిచయం చేసినట్లు సూచిస్తుండగా, ఇది వలసరాజ్యాల పూర్వ కాలంలో ఉనికిలో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 3,000 మంది నివాసితులలో 60 శాతం మంది తమ జీవిత కాలంలో ఈ క్రీడను అభ్యసించినట్లు చెబుతారు.