New York: విదేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాసుల కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల ర్యాంకులను ఈసీఏ ఇంటర్నేషనల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్ 2023ని విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్‌లో న్యూయార్కు అగ్రస్థానంలో నిలిచింది. ప్రవాసుల కోసం గత ఏడాది అత్యంత ఖరీదైన నగరంలో హాంగ్‌కాంగ్ నిలవగా ఈ ఏడాది న్యూయార్కు నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. దీనికి కారణం పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం.. ఇంటి అద్దెల కారణమని ఈసీఏ ఇంటర్నేషనల్ తేల్చి చెప్పింది. అత్యంత ఖరీదైన నగరాల్లో మూడో స్థానంలో జెనీవా, నాలుగో స్థానంలో లండన్‌ను ఆక్రమించాయి.
ఇక అత్యంత ఖరీదైన నగరాల్లో సింగపూర్ 13వ ర్యాంకు నుంచి మొట్టమొదటిసారి టాప్ ఫైవ్ ర్యాంకుకు చేరింది. సాధారణంగా ఆసియా దేశాలు అంత ఖరీదైన నగరాలు కావు. ఎందుకంటే యూరోప్‌తో పోల్చుకుంటే ద్రవ్యోల్బణం అతి తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆగ్నేయాసియా ఫైనాన్షియల్ హబ్ అయిన సింగపూర్‌లో ఇంటి అద్దెలు అమాంతం పెరగడంలో టాప్ ఫైవ్ ర్యాంకింగ్ ఆక్రమించిందని ఈసీఏ ఇంటర్నేషనల్ ప్రాంతీయ డైరెక్టర్ లీ క్వాన్ చెప్పారు. సింగపూర్‌లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయని లీ క్వాన్ వివరించారు. కోవిడ్-19 తర్వాత ఆంక్షలు సడలించడంతో ఇంటి అద్దెలు పెరగడానికి కారణమని ఆయన వివరించారు.
ఈ ఏడాది అత్యంత ఖరీదైన నగరాల్లో ఇస్తాంబుల్ ఏకంగా 95 స్పాట్‌లు జరిగి 108వ స్థానానికి ఎగబాకింది. దీనికి కారణం టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యపీ ఆర్థిక విధానాల వల్ల దేశంలో నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు ఏకంగా 80 శాతం పెరిగాయని తాజా నివేదికలో వెల్లడయ్యింది. ఇక దుబాయి విషయానికి వస్తే ఇక్కడ అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. జాబితాలో 12వ ర్యాంకులో ఉంది. రష్యాకు చెందిన వారు ఇక్కడికి పెద్ద ఎత్తున వలస వస్తున్నారు. ఈ ఏడాది యూరోపియన్ దేశాలకు చెందిన ర్యాంకింగ్‌లు అమాంతం పెరిగాయి. నార్వే,స్వీడిష్ నగరాలు కాస్తా వెనుకపడ్డాయి. కరెన్సీ బలహీనం కావడమే దీనికి కారణం చెబుతున్నారు. యూరోపియన్ యూనియన్ దేశాలతో పోల్చుకుంటే ఫ్రెంచి నగరాల్లో ద్రవ్యోల్బణం తక్కువగా నమోదయ్యాయి.
అలాగే చైనా నగరాల విషయానికి వస్తే ర్యాంకింగ్‌లో వెనుకపడ్డాయి. దీనికి కారణం కరెన్సీ బలహీనపడ్డం, ఇతర దేశాలతో పోల్చుకుంటే అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదు కావడమే. ర్యాంకింగ్‌లలో అమెరికా చెందిన నగరాల్లో ముందు వరుసలో ఉన్నాయి. బలమైన డాలర్‌తో పాటు అధిక ద్రవ్యోల్బణమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అత్యంత ఖరీదైన నగరాల్లో శాన్‌ఫ్రాన్సిస్కో టాప్ 10లో నిలిచింది. ఈసీఏ ఇంటర్నేషనల్ ప్రపంచంలోని 207 నగరాల్లో కన్స్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తో పాటు ఇంటి అద్దెలు.. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకింగ్ ఇచ్చింది. మొత్తం 120 దేశాల్లో 207 నగరాల్లో ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారికి అందుతున్న సేవలు…. ఇంటి అద్దెకు అవుతున్న వ్యయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ నగరం అత్యంత ఖరీదైన నగరమో ఈసీఏ ఇంటర్నేషనల్ అధ్యయనం చేసి ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఈ ర్యాంకులు గత ఏడాదివని ప్రకటించింది.
టాప్ 20 అత్యంత ఖరీదైన నగరాల విషయానికి వస్తే ఇలా ఉన్నాయి. న్యూయార్కు (అమెరికా) నంబర్ వన్ స్థానంలో ఉండగా గత ఏడాది రెండవ ర్యాంకులో ఉంది. హాంగ్‌కాంగ్ రెండవ స్థానంలో ఉండగా.. గత ఏడాది నంబర్ వన్ స్థానంలో నిలిచింది. మూడవ ర్యాంకు జెనవా స్విట్జర్లాండ్, లండన్, బ్రిటన్ నాలుగవ స్థానం, సింగపూర్ 13వ స్థానం గత ఏడాది ఐదవ స్థానం, జూరిచ్, స్విట్జర్లాండ్ ఏడవ స్థానం, శాన్ ఫ్రాన్సిస్కో అమరికా, పదకొండవ స్థానం, టెలెఅవీవ్, ఇజ్రేల్ ఆరవ స్ధానం, సియోల్ దక్షిణ కొరియా పదవి స్థానం, టోక్యో జపాన్ ఐదవ స్థానం, బెర్న్, స్విట్జర్లాండ్ 16వ స్థానం, దుబాయి యూఏఈ 23వ స్థానంలో నిలిచింది. షాంఘై చైనా 8వ స్థానం, గువాంగ్‌జూ, చైనా 9వ స్థానం లాస్ ఏంజిలెస్ అమెరికా 21వ స్థానం, షెన్‌జాన్, చైనా 12వ స్థానం, బీజింగ్ చైనా 14వ స్థానం, కోపెన్‌హాగెన్, డెన్మార్క్ 18వ స్థానం, అబుదబి యూఏఈ 22వ స్థానం, షికాగో అమెరికా 25వ స్థానంలో నిలిచాయి.