Site icon Prime9

Delta Air Lines: డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో తల్లీ కూతుళ్లపై లైంగిక వేధింపులు.. ఎయిర్ లైన్స్ పై 2 మిలియన్ డాలర్లకు దావా

Delta Air Lines

Delta Air Lines

Delta Air Lines:  డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో ఒక మగ ప్రయాణీకుడు ఒక మహిళ మరియు ఆమె టీనేజ్ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో విమానయాన సంస్దపై $2 మిలియన్ల దావా వేయబడింది. ఈ వ్యాజ్యం విమానయాన సంస్థ తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడిందని ఆరోపించడమే కాకుండా బాధితులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని అభ్యర్థించింది.

పట్టించుకోని  సిబ్బంది..(Delta Air Lines)

న్యూయార్క్ నగరంలోని జెఎఫ్‌కె విమానాశ్రయం నుండి గ్రీస్‌లోని ఏథెన్స్‌కు 9 గంటల విమాన ప్రయాణంలో అటెండెంట్లు ఫిర్యాదిదారుల నుండి సహాయం కోసం చేసిన అభ్యర్థనలను నిస్సంకోచంగా విస్మరించారు. ఎయిర్ లైన్స్ సిబ్బంది తాగిన వ్యక్తికి కనీసం 10 వోడ్కా పానీయాలు మరియు ఒక గ్లాసు వైన్ అందించారు. న్యూయార్క్‌లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్‌లో దాఖలైన వ్యాజ్యం, తాగిన మత్తులో ఉన్న వ్యక్తి తల్లీ కూతుళ్ల పట్ట దూకుడుగా ప్రవర్తించాడని మరియు దాదాపు తొమ్మిది గంటల విమాన ప్రయాణంలో అనుచితంగా తాకాడని పేర్కొంది.హెచ్చరించకుండానే సిబ్బంది తాగిన వ్యక్తిని గమ్యస్థానంలో విమానం నుండి నిష్క్రమించడానికి అనుమతించారని దావా పేర్కొంది.

మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు తల్లి మరియు కుమార్తె పక్కన కూర్చున్నట్లు కోర్టు పత్రాలు పేర్కొన్నాయి. కొన్ని డ్రింక్స్ తర్వాత వ్యక్తి 16 ఏళ్ల అమ్మాయితో మాట్లాడటానికి ప్రయత్నించాడు, ఆమె అతనిని పట్టించుకోకుండా ప్రయత్నించింది. ఆ వ్యక్తి బాలికపై అరవడం ప్రారంభించాడు.ఆ వ్యక్తి “అశ్లీల సంజ్ఞలు” చేసాడు మరియు ఆమె చిరునామా మరియు ఆమె గురించి ఇతర సమాచారాన్ని తెలుసుకోవాలని డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి తన వీపుపై చేతులు వేసి భయపెట్టాడని వ్యాజ్యం పేర్కొంది.దీనితో బాలిక తల్లి జోక్యం చేసుకుని తన కూతురు మైనర్ అని ఆ వ్యక్తికి చెప్పింది. ఆ వ్యక్తి పట్టించుకోలేదు. సదరు మహిళ చేయి లాగాడు.ఆ వ్యక్తి తమపై గట్టిగా కేకలు వేయడంతో ఇతర ప్రయాణికులు కూడా ఘటనను గమనించారు.ఈ సంఘటన జూలై 26, 2022 విమానంలో జరిగింది.విమానంలో వారికి ఏమి జరిగింది అనేది కేవలం ఒక పీడకల కాదు, ఇది పూర్తిగా నిరోధించదగినది”అని వాది తరపు న్యాయవాది ఇవాన్ బ్రస్టీన్ చెప్పారు.

 

Exit mobile version