Site icon Prime9

Restaurant: చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు.. ఇవ్వకపోవడంతో రెస్టారెంట్‌కు నిప్పంటించేసాడు..

restaurant-on-fire

restaurant-on-fire

New York: న్యూయార్క్ నగరంలో ఒక వ్యక్తి తాను ఆర్డర్ ఇచ్చిన చికెన్ బిర్యానీ ఇవ్వకపోవడంతో రెస్టారెంట్ కు నిప్పు పెట్టాడు. 49 ఏళ్ల చోఫెల్ నార్బు న్యూయార్క్ నగరంలోని బంగ్లాదేశ్ రెస్టారెంట్ కు వెళ్లి చికెన్ బిర్యానీని ఆర్డర్ చేసాడు. అయితే అక్కడ సిబ్బంది అతడి ఆర్డర్ ను తప్పుగా నమోదు చేసుకున్నారు. దీనితో రెస్టారెంట్‌లోని వెయిట్రెస్ డిష్ తన వద్దకు తీసుకువచ్చినప్పుడు అతను అరవడం ప్రారంభించి, దానిని సిబ్బంది ముఖం పై విసిరాడు.

నార్బు మరుసటి రోజు ఉదయం 6 గంటలకు రెస్టారెంట్‌కి తిరిగి వచ్చాడు, నలుపు రంగు దుస్తులు ధరించి, గ్యాసోలిన్ డబ్బాతో వచ్చి నిప్పు పెట్టాడు. దీనితో మంటలు చుట్టుముట్టాయి. నేను గ్యాస్ డబ్బాను కొన్నాను. రెస్టారెంట్ ను కాల్చడానికి నేను దానిని వెలిగించాను అంటూ అతను చెప్పాడు. అగ్నిప్రమాదం కారణంగా రెస్టారెంట్‌కు $1,500 కంటే ఎక్కువ నష్టం జరిగింది. పోలీసులు మరియు అగ్నిమాపక శాఖ కలిసి వీడియో ఫుటేజీని పరిశీలించి మరుసటి రోజు నోర్బును అరెస్టు చేశారు. నిప్పుపెట్టడం, నేరపూరిత అల్లర్లు మరియు నిర్లక్ష్యం వంటి అభియోగాలు మోపారు.

Exit mobile version