Site icon Prime9

London: ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదం.. 24 గంటల పాటు విమానాల నిలిపివేత

London’s Heathrow Airport Closed Fire Halts Operations: లండన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హీథ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం కారణంగా 24 గంటల వరకు విమానాశ్రయంలో ఎలాంటి రాకపోకలు ఉండవని అధికారులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. హీథ్రో ఎయిర్‌పోర్టులోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్‌లో సాంకేతిక సమస్యలతో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగడంతో ఇతర కార్యక్రమాలకు సైతం ఆటంకం ఏర్పడింది.

 

ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌పోర్టు సిబ్బంది అలర్ట్ అయింది. వెంటనే సిబ్బంది ప్రయాణికులకు అనౌన్స్ మెంట్ విడుదల చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ పోర్టులో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని చెప్పారు. ప్రయాణికులు ఎవరూ కూడా 24 గంటల పాటు విమానాశ్రయానికి రావొద్దని సూచించారు. ఏమైనా ఎమెర్జెనీ సహాయం కోసం విమానయాన సంస్థను ఆశ్రయించాలని చెప్పారు.

 

కాగా, భారీ అగ్ని ప్రమాదం కారణంగా సమీపంలో ఉన్న ఇళ్లకు కరెంట్ అంతరాయకం కలిగింది. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉండే సిబ్బంది మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్లను ఖాళీ చేయించారు. మంటలను ఆర్పేందుకు 10 అగ్నిమాపక యంత్రాలు, 70 మంది సిబ్బంది ప్రయత్నించారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ధన నష్టం వివరాలు తెలియరాలేదు.

Exit mobile version
Skip to toolbar