UK Election: బ్రిటన్ ఎన్నికల ఫలితాల్లో ప్రధాని రిషి సునాక్ కు షాక్ తగిలింది. ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ ఓడిపోయారు. యూకేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మెజార్టీ స్థానాలను ఆపార్టీ కైవసం చేసుకుంది. దీంతో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఓటమి చవిచూసింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత అధికారాన్ని కైవసం చేసుకుంది ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ అయిన లేబర్ పార్టీ. అయితే తన ఓటమిని అంగీకరించిన ప్రధాని రిషి సునాక్..శాంతియుత పద్దతిలో అధికార మార్పిడి జరుగుతుందని ప్రకటించారు.
ఓడిపోయిన ఎనిమిది మంది మంత్రులు..(UK Election)
బ్రిటీష్ పార్లమెంట్‌లోని 650 సీట్లకు గాను 400 సీట్లు గెలుచుకుని లేబర్ పార్టీ అఖండ మెజారిటీని సాధించింది. ప్రధానమంత్రి రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ కేవలం 110 సీట్లను మాత్రమే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 61 ఏళ్ల సర్ కీర్ స్టార్మర్, రిషి సునక్ తర్వాత బ్రిటీష్ ప్రధానమంత్రి అవుతారు, అతని లేబర్ పార్టీ కన్జర్వేటివ్‌లపై భారీ మెజారిటీతో విజయం దిశగా దూసుకువెడుతోంది. మాజీ చీఫ్ ప్రాసిక్యూటర్ అయిన స్టార్మర్ ప్రతిపక్షనాయకుడిగా వ్యవహరించి తన పార్టీని విజయపధంలో నడిపారు. ఎనిమిది మంది క్యాబినెట్ మంత్రులు ఈ ఎన్నికల్లో ఓడారు. వీరిలో గ్రాంట్ షాప్స్ , పెన్నీ మోర్డాంట్ గిలియన్ కీగన్, లూసీ ఫ్రేజర్, మిచెల్ డోనెలన్, అలెక్స్ చాక్ తదితరులు ఉన్నారు. బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ కింగ్ చార్లెస్ III వద్దకు వెళ్లి తన రాజీనామాను సమర్పించనున్నట్లు స్కై న్యూస్ నివేదించింది. తరువాత కైర్ స్టార్మర్ అధికారికంగా చక్రవర్తిచే నియమించబడతారు. దీనితో