Site icon Prime9

Japan: ఒకేసారి రన్ వే పై వచ్చిన రెండు విమానాాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

Japan

Japan

Japan: జపాన్‌ రాజధాని టోక్యో లోని ఓ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. టోక్యోలోని విమాశ్రయం రన్ వే పై రెండు కమర్షియల్ విమానాలు ప్రమాదవాశత్తూ ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అదృష్టవశత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు.

టోక్యోలోని హనేడా ఎయిర్‌పోర్టు లో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. టోక్యో నుంచి బ్యాంకాక్‌ బయల్దేరిన థాయ్‌ ఎయిర్‌వేస్‌ ఇంటర్నేషనల్‌ విమానం.. అదే సమయంలో తైపీకి బయల్దేరిన ఇవా ఎయిర్‌వేస్‌ విమానం కూడా రన్‌వేపై వచ్చింది. దీంతో ఒకదాని కొకటి ఢీకొన్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాలను నిలిపివేశారు.

 

 

తాత్కాలికంగా క్లోజ్(Japan)

ఒకే రన్‌వే పై రెండు విమానాలు వచ్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనలో ఓ విమానం వింగ్‌లెట్‌ స్వల్పంగా దెబ్బతింది. ఆ వింగ్‌ భాగాలు రన్‌వే పై పడ్డాయి. మరో వైపు ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రెండు విమానాలను ఒకేసారి రన్‌వే పైకి ఎలా అనుమతించారనే దానిపై స్పష్టత లేదు. దీనిపై ఎయిర్‌లైన్‌ సంస్థలు గానీ, ఎయిర్‌పోర్టు అధికారులు గానీ స్పందించలేదు. ఈ విమానాశ్రయంలో 4 రన్‌వేలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఘటన జరిగిన రన్‌వేను తాత్కాలికంగా క్లోజ్ చేశారు. ఈ ఘటనతో కొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమైనట్టు అధికారులు తెలిపారు.

 

Exit mobile version