Site icon Prime9

Italy: ఒకే వ్యక్తికి కరోనా, మంకీపాక్స్, హెచ్‌ఐవీ

Italy: ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి కరోనా, మంకీపాక్స్, హెచ్‌ఐవీ ఒకేసారి నిర్ధారణ అయ్యాయి. ఈ తరహా కేసు నమోదవ్వడం మెడికల్ హిస్టరీలో ఇదే తొలిసారి. ఈ మేరకు ‘జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్’లో ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. బాధిత వ్యక్తి స్పెయిన్ పర్యటనకు వెళ్లొచ్చిన 9 రోజుల తర్వాత అతడిలో గొంతునొప్పి, అలసట, తలనొప్పి, గజ్జ భాగంలో వాపు లక్షణాలు కనిపించాయి. లక్షణాలు కనిపించిన 3 రోజుల తర్వాత పరీక్ష చేయించుకోగా అతడికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది.

తరువాత అతను మంకీపాక్స్, హెచ్ఐవి మరియు వరుస పరీక్షలను చేయమని కూడా కోరాడు. అతని శరీరంపై కొన్ని బొబ్బలతో పాటు అతని ఎడమ చేతిపై దద్దుర్లు కనిపించాయి.ఆ వ్యక్తి యొక్క హెచ్ఐవి పరీక్షలో అతనికి అధిక వైరల్ లోడ్ ఉందని తెలిసింది. ఇటాలియన్ వ్యక్తి మూడు వైద్య పరీక్షలకు పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందిన వారం రోజుల తర్వాత, అతను మంకీపాక్స్ మరియు కరోనావైరస్ రెండింటి నుండి కోలుకోవడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.

మంకీపాక్స్, కొవిడ్-19 ఒకేసారి సోకే అవకాశం ఉందని ఈ కేసు ద్వారా నిర్ధారణ అయ్యిందని ఆగస్టు 19న ప్రచురితమైన ‘జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్’ రిపోర్ట్ పేర్కొంది. అతను స్నెయిన్ లో ఉన్న సమయంలో అసురక్షిత లైంగికసంబంధాలు కలిగి ఉన్నట్లు అంగీకరించాడు.

Exit mobile version