Prime9

Israel Attack On Gaza: ఇజ్రాయిల్ భీకర దాడి, ఒక్కరోజే 150మంది మృతి

Breaking News: Israel Attack On Gaza: గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడింది. ఈ ఘటనలో వందమందికిపైగా మరణించారు. దాడుల నేపధ్యంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యహూ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణపై హమాస్ అంగీకరించలేదని దాడులు చేసినట్లు తెలిపారు. తమ బందీలను విడుదల చేయడానికి హమాస్ ఒప్పుకోవడం లేదని అన్నారు. అమెరికా రాయబారం చేసినా కాల్పుల విరమణకు హమాస్ ఒప్పుకోలేదన్నారు.

 

ఇజ్రాయిల్ చేసిన దాడిలో సామాన్యులు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి ఇజ్రాయిల్ హమాస్ పై దాడి జరిపింది. ఈ ఘటనలో 103 మంది మరణించారు. శనివారం ఒక్కరోజే 150మందికి పైగా మరణించారు.

Exit mobile version
Skip to toolbar