Site icon Prime9

Pakistan Army Chief Bajwa: ఎనిమిదేళ్లలో రూ. 1,270 కోట్లు ఆర్జించిన పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్‌ బాజ్వా

Bajwa

Bajwa

Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్‌ ఖమర్‌ బాజ్వా త్వరలోనే రిటైర్‌ కాబోతున్నారు. ఈ నేపధ్యంలో ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావేద్‌ బాజ్వా ఆయన కుటుంబసభ్యులు, ఆయన బంధువులు కేవలం ఆరు సంవత్సరాల కాలంలో బిలియనీర్లు అయ్యారని వెల్లడించింది పాక్‌ డిజిటల్‌ మీడియా. తన పదవి కాలంలో బాజ్వా 1,270 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని వివరాల్లో సహా వెబ్‌సైట్‌లో పెట్టింది. దీంతో ప్రభుత్వం ప్రభుత్వం ఒక్కసారి ఉలిక్కిపడింది. వెంటనే ప్యాక్ట్‌ ఫోకస్‌ అనే వెబ్‌సైట్‌కు ఈ సమాచారం ఎలా వచ్చిందో విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ది ఫ్యాక్ట్‌ ఫోకస్‌ వెబ్‌సైట్‌ జనరల్‌ బాజ్వా, ఆయన కుటుంబ సంపద 2013 నుంచి 2021 వరకు ఎలా పెరిగిందో వివరాలను వెబ్‌సైట్‌ పేజీలో పెట్టింది.

పాక్‌ వెబ్‌సైట్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం జనరల్‌ బాజ్వా కుటుంబ ఆస్తులు ప్రస్తుతం మార్కెట్‌ విలువ ప్రకారం .. పాకిస్తాన్‌తో పాటు విదేశాల్లో ఉండే ఆయన ఆస్తుల విలువ 1,270 కోట్ల రూపాయలుగా విలువ కట్టింది. కాగా ఈ నెలాఖరులో ఆయన రిటైర్మెంట్‌ తీసుకోవడానికి ముందు ఈ నివేదిక విడుదల కావడంతో ఆయనకు కాస్తా ఇబ్బందికరమైన పరిస్థితే. జనరల్‌ బాజ్వా భార్య అయేషా అమ్జాద్‌ పేరు పై 2016లో ఎలాంటి ఆస్తులు లేవు. ఆ తర్వాత నుంచి ఆమె ఆస్తులు కేవలం ఆరు సంవత్సరాల్లో 220 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. అయితే పాకిస్తాన్‌ ఆర్మీ ఆయనకు ఇచ్చిన రెసిడెన్షియల్‌ ప్లాట్‌లు, కానీ కమర్షియల్‌ ప్లాట్లు కానీ ఇళ్లను కానీ వీటిలో కలుపలేదు. బాజ్వా కోడల ఆస్తుల విషయానికి వస్తే అక్టోబర్‌ 2018లో ఆమె ఇన్‌కంటాక్స్‌ ఫైలింగ్‌ అప్పుడు జీరో చూపించారు. అటు తర్వాత నవంబర్‌ 2, 2018 నాటికి ఆమె ఆస్తుల విలువ 127 కోట్ల రూపాయలు చూపించారు. ఆయన కోడలు మహనూర్‌ సోదరి హమ్మా నాసీర్‌ ఆస్తులు 2016లో సున్నా నుంచి 2017 నాటికి వందల కోట్లకు చేరాయి. ఇంతేనా ఆర్మీ చీఫ్‌ కుమారుడు సబీర్‌ హమీద్‌ మామగారు టాక్స్‌ రిటర్న్‌ 2013లో పది లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండేది. అటు తర్వాత నుంచి ఆయన సంపద వందల కోట్లకు చేరిందని వెబ్‌సైట్‌ వెల్లడించింది.

బాజ్వా ఆస్తుల విలువ వెబ్‌సైట్‌లో బహిరంగం కావడంతో ఆర్థికమంత్రి ఇషాక్‌ దార్‌ విచారణకు ఆదేశించారు. చట్ట ప్రకారం ఆదాయపు పన్ను చెల్లింపుదార్ల సమాచారం గోప్యంగా ఉంచడం జరుగుతోందని.. ఇలా వెబ్‌సైట్‌లో సమాచారం పెట్టడం చట్ట ప్రకారం నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆర్థికమంత్రి అంటున్నారు. వెంటనే ఆయన ప్రధానమంత్రి స్పెషల్‌ అసిస్టెంట్‌ రెవెన్యూ డిపార్టుమెంట్‌కు చెందిన తారిక్‌ మహమూద్‌ పాషాను సమాచారం ఎలా లీకైందో విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక అందించాలని ఆదేశించారు.

Exit mobile version