Horse Riding: గుర్రపుస్వారీ సమయంలో జరిగిన ప్రమాదంలో మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ ప్రాణాలు కోల్పోయింది. విశ్వసుందరి ఫైనలిస్టు, ఆస్ట్రేలియా మోడల్ అయిన ఆమె గుర్రపు స్వారీ చేసేటప్పుడు ప్రమాదానికి గురి అయింది. ఈ నేపథ్యంలో ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
గుర్రంపై నుంచి పడి(Horse Riding)
ఆస్ట్రేలియాకు చెందిన మోడల్ సియెన్నా వీర్ (23), 2022 ఏడాదిలొ విశ్వసుందరి పోటీల్లో పైనలిస్ట్‌గా ఎంపికైంది. గత నెలలో ఆమె విండ్సర్ పోలో గ్రౌండ్‌లో గుర్రపు స్వారీ చేస్తుండగా గుర్రంపై నుంచి కిందికి పడిపోయింది. దీంతో సియెన్నా తీవ్రంగా గాయపడింది. అప్పటి నుంచి వైద్యులు ఆమెకు వెంటిలేటర్ పైనే చికిత్స అందించారు. అయితే ఆమె ఇప్పటి వరకు చికిత్సకు స్పందించలేదు. దీంతో వైద్యుల సూచన మేరకు వెంటిలేటర్ తొలగించేందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈ మరణవార్తను ఆమె మోడలింగ్ ఏజెన్సీ కూడా ధ్రువీకరించింది. ‘ఎప్పటికీ మా హృదయాల్లో నీ స్థానం పదిలం’ అంటూ నివాళి అర్పించింది.
బ్రిటన్ లో సెటిల్ అవ్వాలనుకుని
సియెన్నా వీర్‌కు చిన్నతనం నుంచే గుర్రపు స్వారీ అంటే ఎక్కువ ఇష్టం. హార్స్ రైడింగ్ తన జీవితంలో భాగమని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించింది. తన కెరీర్‌లో మరింత ఎదిగేందుకు బ్రిటన్‌కు వెళ్లాలనుకుంది. కానీ ఇంతలో తనకు ఎంతో ఇష్టమైన గుర్రపు స్వారీ చేస్తూనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం విచారకరం.