Henry Kissinger: యునైటెడ్ స్టేట్స్ మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన హెన్రీ కిస్సింజర్ బుధవారం 100 సంవత్సరాల వయస్సులో మరణించారు.కిస్సింజర్ కనెక్టికట్‌లోని తన ఇంట్లో మరణించారని కిస్సింజర్ అసోసియేట్స్ తెలిపింది.
కిస్సింజర్ ఈ ఏడాది మే నెలలో వైట్‌హౌస్‌లో సమావేశాలకు హాజరవడం, మరియు ఉత్తర కొరియా నుండి అణు ముప్పు గురించి సెనేట్ కమిటీ ముందు సాక్ష్యమివ్వడం వంటి కార్యక్రమాలలో చురుకుగా ఉన్నారు. జూలై లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలవడానికి బీజింగ్‌కు ఆకస్మిక పర్యటన చేసారు. 1970లలో, రిపబ్లికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఆధ్వర్యంలో విదేశాంగ కార్యదర్శిగా పని చేస్తున్నప్పుడు పలు అంశాల్లో కీలకపాత్ర పోషించారు. ఇద్దరు అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్ మరియు గెరాల్డ్ ఫోర్డ్ వద్ద విదేశాంగ కార్యదర్శిగా కూడా పనిచేశారు.వియత్నాం నుండి వైదొలిగే సమయంలో మరియు చైనాతో దౌత్య సంబంధాల ప్రారంభ సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో కూడా కిసింజర్ ప్రముఖ పాత్ర పోషించారు.
భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు..(Henry Kissinger)
జూలై 2005లో అమెరికా మాజీఅధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరియు విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్ మధ్య 1971 యుద్ధంలో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసే భారత్-పాకిస్తాన్ యుద్ధానికి కొంతకాలం ముందు జరిగిన టేప్ సంభాషణలను డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్ వర్గీకరించింది.మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో భేటీ అయిన కొద్దిసేపటికే వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు టేపుల్లో వినిపిస్తోంది. ఈ సంబాషణల్లో నిక్సన్ శ్రీమతి గాంధీని పాత మంత్రగత్తె”గా పేర్కొన్నాడు. కిస్సింజర్ ఆమెను తీవ్రంగా దుర్బాషలాడారు. భారతీయులను బాస్టర్డ్స్ గా సంబోధించారు. భారతీయులను అత్యంత సెక్స్‌లెస్ మరియు దయనీయమైనవారిగా ఆయన వర్ణించడాన్ని కూడా టేపులు వెలుగులోకి తెచ్చాయి.ఈ వ్యాఖ్యలు పబ్లిక్‌గా మారిన వెంటనే, కిస్సింజర్ తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని తాను శ్రీమతి గాంధీని గౌరవిస్తున్నానని చెప్పారు.
H