Site icon Prime9

Evergreen: ఆ కంపెనీ ఉద్యోగులకు బోనస్ గా 5 ఏళ్ల జీతం

Evergreen

Evergreen

Evergreen: తైవాన్ లోని ఓ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. తైవాన్ లోని ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ‘ఎవర్ గ్రీన్ మెరైన్’భారీ బోనస్ ను కానుకగా ఇచ్చింది. ఆ బోనస్ కూడా 1, 2 రెండేళ్లు కాదు..ఏకంగా 5 సంవత్సరాల జీతంగా ఉద్యోగులకు అందించింది. కంపెనీ లో పనిచేస్తున్న దాదాపు 3100 మంది ఉద్యోగులు ఈ బోనస్ అందుకోనున్నారు.

 3100 మంది ఉద్యోగులకు..(Evergreen)

అంతేకాకుండా అదే కంపెనీలో ఈ సంవత్సరం జీతాల పెరుగుదల కూడా భారీగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. 2022 లో 10 నుంచి 11 నెలల వేతనాలకు సమానంగా ఈ సంవత్సరం వేతనాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో అందుకున్న 50 నెలల బోనస్‌ తో కలుపుకొంటే మొత్తంగా ఆ కంపెనీ ఉద్యోగులు అందుకుంటున్న బోనస్‌ దాదాపు 5 సంవత్సరాల జీతానికి సమానంగా ఉంటుంది. కాగా కంపెనీ ప్రకటించిన బోనస్‌లు ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ఆధారంగా కూడా ఉంటున్నాయి.

 కరోనాలో కంపెనీకి భారీ లాభాలు

ఈ ఎవర్‌గ్రీన్ మెరైన్ కంపెనీకి చెందిన కంటైనర్ షిప్ 2021లో సూయజ్ కెనాల్‌లో మునిగిపోయింది. ఎవర్‌గ్రీన్‌లో వార్షిక వేతనాలు 44,745 డాలర్లు ( అంటే భారత కరెన్సీలో రూ. 37,00,807) నుంచి 171,154 డాలర్లు (రూ. 1,41,55,950) మధ్య ఉంటాయని ఓ ఆస్ట్రేలియన్‌ వెబ్‌సైట్ పేర్కొంది.

ది స్ట్రెయిట్స్ టైమ్స్ ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎవర్‌గ్రీన్‌ 16.25 బిలియన్‌ డాలర్లు ఆర్జించింది. ఆ సంవత్సరం కంపెనీ లాభం 39.82 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సంక్షోభం, పలు దేశాల్లో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వినియోగ వస్తువులకు డిమాండ్ పెరగడమే కంపెనీ భారీ లాభాలకు కారణమని నివేదిక పేర్కొంది.

 

Exit mobile version