Prime9

Elon Musk New Party: అమెరికాలో కొత్త పార్టీ.. పేరు ప్రకటించిన మస్క్

Elon Musk Declared new political party name the america party: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో విభేదాల వేళ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అమెరికాలో కొత్త పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఉందా? అని ఎక్స్‌లో ఎలాన్ మస్క్ పోల్ పెట్టారు. దీనికి 80 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారని మస్క్ పేర్కొన్నారు. దీంతో‘ద అమెరికా పార్టీ’ అంటూ కొత్తగా స్థాపించినున్న పార్టీకి నామకణం చేశాడు.

 

మరోవైపు, ఎలాన్ మస్క్ గురించి డొనాల్డ్ ట్రంప్‌ను అడగగా.. అతడి గురించి ప్రస్తుతం తాను ఏమీ ఆలోచించడం లేదని వెల్లడించాడు. అయితే, తాను చైనా, రష్యా సహా ఇతర విషయాలతో బిజీ బిజీగా ఉన్నట్లు వ్యాఖ్యానించాడు. అనంతరం మస్క్ బాగుండాలని రిపోర్టర్లతో ట్రంప్ చెప్పాడు. కాగా, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Exit mobile version
Skip to toolbar