Site icon Prime9

Donald Trump: ‘నేను కొరికిన పిజ్జా ముక్క ఎవరైనా తింటారా..’ ఫ్యాన్స్ కు ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

DonaldTrump

DonaldTrump

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే తుంటరి పనులకు కేరాఫ్ అడ్రస్. ఆయన వ్యాఖ్యలే కాదు.. చేసే పనులు కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాయి. అయితే తాజగా ట్రంప్ చేసిన ఓ పని కూడా ఇపుడు వైరల్ అయింది. అమెరికాలోని ఫోర్ట్ మేయర్స్ లోని లీ కౌంటీలో ట్రంప్ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్తున్న ట్రంప్ డౌన్ టౌన్ హౌస్ పిజ్జా అనే షాపు దగ్గర ఆగాడు. అయితే ట్రంప్ పిజ్జా షాపులో ఉన్నారని తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరకున్నారు.

 

 

చేతిలో జంబో పిజ్జా పెట్టుకుని..(Donald Trump)

అయితే ఓ జంబో పిజ్జా ను తీసుకుని తింటూ అక్కడ ఉన్న అభిమానులను ఓ ప్రశ్న అడిగాడు. ‘నేను కొరికిన పిజ్జా ముక్క ఎవరైనా తింటారా..’ అని ట్రంప్ అడిగారు. అయితే ఆయన ఆఫర్ విన్న ఫ్యాన్స్ అవాక్క్ అయ్యారు. ట్రంప్ ఆఫర్ కు ‘నో’ అని పెద్దగా అరుస్తూ సమాధానమిచ్చారు. దీంతో ట్రంప్ పిజ్జా తిన్నారు. అయితే ట్రంప్ చేసిన పనిని ఓ రిపోర్టర్ వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. ట్రంప్ వీడియో పై పలువురు నెటిజన్లు వాళ్లు స్ట్రైల్లో రెస్పాండ్ అయ్యారు. ‘చేతిలో అంత పెద్ద పిజ్జా పెట్టుకుని.. అందులో ఓ ఎంగిలి ముక్కను ఆఫర్ చేస్తారా’ అని కామెంట్స్ పెడుతున్నారు. కాగా, డొనాల్డ్ ట్రంప్ ఫాస్ట్ ఫుడ్ ను అమితంగా ఇష్టపడతారు. అందులో కూడా పిజ్జాస్ అంటే ఆయన బాగా ఇష్టం. ఫారెన్ టూర్స్ లో కూడా ఆయన విమానంలో ఎల్లపుడూ పిజ్జాలు అందుబాటులో ఉంటాయని ఆయన సిబ్బంది చెప్పారు.

 

 

Exit mobile version