Donald Trump announces a 90-day pause on reciprocal tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే చైనా తప్ప మిగతా 70 దేశాలపై ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అదే విధంగా చైనాపై సుంకాలను 104 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. చైనా ప్రపంచ మార్కెట్లను అగౌరవపరిచిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో యూఎస్ మార్కెట్లో జోష్ నింపింది. 90 రోజుల పాటు చైనా మినహా అన్ని దేశాలపై సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగానే స్టాక్ మార్కెట్లు ఏకంగా 3.5 ట్రిలియన్ డాలర్ల మేర లాభం పొందాయి. అత్యధికంగా టెస్లా షేర్ 15 శాతం, ఎన్‌విడియో 13 శాతం, యాపిల్ 11 శాతం లాభపడ్డాయి.