Donald Trump Administration Fires USAID Workers: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేశారు. ఇందులో దాదాపు 2వేల మందికిపైగా ఉద్యోగులపై వేటు వేయడంతో పాటు కొంతమందిని మినహాయించి మిగిలిన వేలమంది ఉద్యోగులకు బలవంతంగా సెలవులు ఇచ్చినట్లు యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ వెబ్‌సైట్‌లోని నోటీసులో పేర్కొంది. అయితే ఫెడరల్ జడ్జి.. ఉద్యోగులను తొలగించేందుకు అనుమతి ఇచ్చారని, ఆ తర్వాతే ట్రంప్ బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఉద్యోగులు కోరగా.. యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి కార్ల్ నికోలస్ రిజెక్ట్ చేశారు. కాగా, యూఎస్ ప్రభుత్వం చేసే అనవసర ఖర్చులను తగ్గించేందుకు మస్క్ ఆధ్వర్యంలో ఉన్న డోజ్ చాలా మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులను తొలగించింది. తాజాగా, మళ్లీ ఉద్యోగులను తొలగించడంతో మిగితా ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది.