Site icon Prime9

Air India Flight : ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా విమానాన్ని రష్యాకు మళ్లించారు.. ఎందుకో తెలుసా?

Air India flight

Air India flight

Air India Flight : ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిరిండియా విమానం ఇంజిన్‌లో లోపం కారణంగా రష్యాలోని మగదాన్‌కు దారి మళ్లించారు. ఎయిర్ ఇండియా అధికారి తెలిపిన వివరాల ప్రకారం విమానం రష్యాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారని  ఒక అధికారి తెలిపారు.

ప్రయాణీకులకు సహకారం..(Air India Flight)

ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు నడుపుతున్న ఎయిర్ ఇండియా విమానం AI173 ఇంజిన్‌లో ఒకదానిలో సాంకేతిక సమస్య ఏర్పడింది. 216 మంది ప్రయాణికులు మరియు 16 మంది సిబ్బందితో ఉన్న విమానాన్ని దారి మళ్లించి రష్యాలోని మగదాన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు అని అధికారి తెలిపారు.ఇంకా, ప్రయాణీకులకు అన్ని విధాలా సహాయసహకారాలు అందించబడుతున్నాయన్నారు,వారి గమ్యస్థానాలకు వీలైనంత త్వరగా చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఎంపికలు అందించబడతాయని అధికారి తెలిపారు. విమానాన్ని తనిఖీలు చేస్తున్నామన్నారు. విమానం ఈరోజు తెల్లవారుజామున 4:23 గంటలకు ఢిల్లీ నుంచి విమానం బయలుదేరింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో చెన్నై నుంచి సింగపూర్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని ప్రతికూల వాతావరణం, రద్దీ కారణంగా మలేషియాకు మళ్లించారు. గత ఏడాది నవంబర్ 26న మద్యం మత్తులో శంకర్ మిశ్రా తన సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన కేసులో ఎయిర్ ఇండియా తన కస్టమర్ మరియు సోషల్ మీడియా వినియోగదారుల నుండి విమర్శలను ఎదుర్కొంటోంది. అప్పటి నుండి, ఇది వివిధ కారణాల వల్ల వార్తల్లో నిలిచింది.వాటిలో ఆహార సేవల్లో నాణ్యత లేకపోవడం మరియు పేలవమైన సిటింగ్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి.

Exit mobile version