Site icon Prime9

China President: జిన్ పింగ్ చరిత్ర.. మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నిక

China President

China President

China President: చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మూడోసారి ఆ దేశ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఈ మేరకు జిన్ పింగ్ శుక్రవారం అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆయన డ్రాగన్ దేశానికి మరో ఐదేళ్ల పాటు అధిపతిగా కొనసాగుతారు.

గతేడాది అక్టోబరు 16 న జరిగిన కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా కాంగ్రెస్‌(సీపీసీ) సమావేశాల్లో.. జిన్‌పింగ్‌(69)ను మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

దీంతో సీపీసీ వ్యవస్థాపకుడు మావో తర్వాత మూడోసారి పార్టీ పగ్గాలు చేపట్టిన మొదటి నేతగా జిన్‌పింగ్‌ ఘనత సాధించారు.

సీపీసీ లో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో.. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సులభమైంది.

సాధారణంగా సీపీసీ నిర్ణయాలనే అమలు చేస్తూ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (చైనా పార్లమెంట్‌).. జిన్‌పింగ్‌ ను మూడోసారి అధ్యక్షుడిగా ఎంచుకుంది.

మొత్తం 2,950 మందికి పైగా సభ్యులు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక తర్వాత.. జిన్‌పింగ్‌ రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.

ఇక జిన్‌పింగ్‌ అత్యంత సన్నిహితుడు హన్‌ ఝెంగ్‌ను దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

 

సర్వాధికారాలన్నీ ఆయనకే..(China President)

మరోవైపు, ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా గుర్తింపు తెచ్చుకున్న చైనా సాయుధ దళాలకు, పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ అధిష్ఠానమైన కేంద్ర మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌ గా కూడా జిన్‌పింగ్‌నే ఎన్నుకుంటూ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ తీర్మానం చేసింది.

దీంతో సర్వాధికారాలన్నీ మళ్లీ జిన్‌పింగ్‌ తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా, మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌గా చైనా లోని మూడు అధికార కేంద్రాలకు ఆయన నాయకుడిగా కొనసాగతారు.

దీంతో జిన్‌పింగ్‌ జీవితకాలం అధికారంలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

 

China's Xi Jinping Takes Rare Direct Aim at U.S. in Speech - WSJ

 

ది మోస్ట్ పవర్ ఫుల్ నేతగా

‘ది మోస్ట్ పవర్ ఫుల్ మ్యాన్ ఇన్ ది వరల్డ్’ పేరుతో జిన్ పింగ్ బయోగ్రఫీని రాస్తున్న రచయిత మాట్లాడుతూ.. జిన్ పింగ్ దృష్టి చైనాపైనే ఉంటుందని.. ఆయన ఈ దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా చూడాలనుకుంటున్నారని తెలిపారు.

జిన్ పింగ్ మొదటిసారి 2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

అప్పటి నుంచి పదేళ్ల పాటు పదవి చేపట్టిన ఆయన.. చైనా కమ్యూనిస్టు అధినాయకుడు మావో జెడాంగ్‌ తర్వాత మోస్ట్ పవర్ ఫుల్ నేతగా ఆవిర్భవించారు.

సాధారణంగా చైనాలో పైస్థాయి నాయకులు ఎవరూ రెండుసార్లకు మించి పదవిలో కొనసాగకుండా.. 68 ఏళ్లు నిండిన తర్వాత రిటైర్ మెంట్ తీసుకోవాలని..

మావో తర్వాత పగ్గాలు చేపట్టిన డెంగ్‌ జియావోపింగ్‌ నిర్దేశించారు. అయితే, ఈ రూల్ మారుస్తూ 2018లో జిన్‌పింగ్‌ సర్కారు రాజ్యాంగంలో కీలక సవరణలు చేసింది.

దీంతో రెండు దఫాలు పదవీకాల పరిమితి నుంచి దేశాధ్యక్షుడికి మినహాయింపు కల్పించింది. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌ మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు ఆ సవరణే మార్గం కల్పించింది.

ఇక, 2021 లో జరిగిన సీపీసీ ప్లీనరీ సమావేశంలో.. చైనాకు జీవితకాల అధినాయకుడిగా షీ జిన్‌పింగ్‌ను నియమించేందుకు వీలుగా చారిత్రాత్మక తీర్మానం చేశారు.

ఈ విధంగా చైనాకు ముచ్చటగా మూడోసారి జిన్ పింగ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

 

 

Exit mobile version
Skip to toolbar