China hits back at Donald Trump with 84 Percent retaliatory tariff on US goods: చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అంతకుముందు ఈ సుంకాలు 34 శాతంగా ఉండేది. అయితే, చైనాపై ట్రంప్ ప్రభుత్వం 104 శాతం టారిఫ్స్ విధించడంతో డ్రాగన్ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ ముదురుతోన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, అధిక టారిఫ్స్ విధిస్తూ ప్రపంచ దేశాలు తమను దోచుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. అందుకే తామూ సుంకాలు పెంచామని స్పష్టం చేశారు. దీంతో అమెరికా లో పరిశ్రమలు, ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికాలో బ్లూ కాలర్ జాబ్స్ చేసేందుకు యువత సిద్ధంగా లేరన్నారు. అక్కడి కంపెనీలు చీప్ లేబర్ కోసం చూస్తాయన్నారు. విదేశీయులు లేకుండా అగ్రరాజ్యం మనుగడ కష్టమని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ట్రంప్ నిర్ణయం ఎటు దారితీస్తుందో చూడాలి.
మరోవైపు, అమెరికాపై రష్యా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధించిన సుంకాలు.. డబ్ల్యూటీఓ ప్రాథమిక నిబంధనలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఉందన్నారు. అంతర్జాతీయ వాణిజ్య చట్ట నియమాలకు వాషింగ్టన్ కట్టుబడి ఉందని రష్యా విదేశాంగ ప్రతినిధి మారియా జఖరోవా వెల్లడించారు.