Site icon Prime9

chickens death: కోపంతో పక్కంటి కోళ్లను చంపి.. జైళ్లో పడ్డాడు

chickens death

chickens death

chickens death: ఓ వ్యక్తి పక్కంటి కోళ్లను చంపినందుకు అతనికి 6 నెలల జైలు శిక్షవిధించింది కోర్టు. కోళ్లను చంపితే జైలు శిక్షా అని నోరేళ్ల పెట్టకండి. సదరు వ్యక్తి చంపింది ఒకటి రెండు కోళ్లను కాదు.. ఏకంగా 1,100 కోళ్లను చంపాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది.

అసలేం జరిగింది(chickens death)

చాలా కాలం నుంచి ‘జాంగ్’ అనే వ్యక్తికి తన పక్కింట్లో ఉంటున్న ‘గూ’ అనే వ్యక్తితో గొడవలు జరుగుతున్నాయి. పర్మిషన్ లేకుండా తన చెట్లను నరికి వేస్తున్నాడనే గూ పై ఆరోపణలు చేశాడు జాంగ్. దీంతో జాంగ్ పై కోపం పెంచుకున్న గూ.. జాంగ్ కోళ్ల ఫారమ్ లోకి దొంగచాటుగా వెళ్లి కోళ్ల ముఖాలపై టార్చ్ లైట్ వేశాడు. దీంతో కోళ్లన్నీ ఫారమ్ లోని ఓ మూలకు చేరాయి. తర్వాత 460 కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో జాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు గూ ను అరెస్టు చేశారు. నష్టపరిహారం కింద జాంగ్ కు 3 వేల యువాన్లు కట్టాలని ఇద్దరి మధ్య రాజీ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడని జాంగ్ మరింత కోపం పెంచుకున్నాడు గూ. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.

 

ప్రతీకారం కోసం

అంతే ఇంకోసారి కోళ్ల ఫారమ్ లోకి వెళ్లాడు. టార్చ్ లైట్ వేసి కోళ్లను భయపెట్టి మరో 640 కోళ్లను చంపాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఉద్దేశపూర్వకంగా నిందితుడు కోళ్లను చంపినట్టు గుర్తించింది. ఇతరుల ప్రాపర్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తించినందుకు గూ పై కోర్టు చర్యలు తీసుకుంది. ఆరు నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

 

Exit mobile version