Site icon Prime9

Dominic Raab: బ్రిటన్‌ ఉప ప్రధాని డొమినిక్‌ రాబ్‌ రాజీనామా..

Dominic Raab

Dominic Raab

Dominic Raab: బ్రిటన్‌ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్‌ రాబ్‌ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. న్యాయశాఖలో పాటు వైట్‌హాల్‌ విభాగాల్లో ఆయన సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డారంటూ గత కొంతకాలంగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు కమిటీ రిపోర్ట్‌ గురువారం ప్రధాని సునాక్‌కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం డొమినిక్‌ రాబ్‌ తన పదవులకు రాజీనామా ప్రకటించారు.

దర్యాప్తు నివేదిక రాకముందే..(Dominic Raab)

ఈ సీనియర్‌ కన్జర్వేటివ్‌ ఎంపీ తన పేషీలో పని చేసే సిబ్బందిని వేధించినట్లు, అవమానించినట్లు, ఏడ్పించినట్లు.. సిబ్బంది ఫిర్యాదులు చేశారు. ఈ విషయాన్ని బ్రిటిష్‌ టాబ్లాయిడ్‌ గార్డియన్‌ తొలుత బయటపెట్టింది. అయితే.. ఆరోపణలను డొమినిక్‌ రాబ్‌ ఖండిస్తూ వస్తున్నప్పటికీ, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా సీనియర్‌ న్యాయవాది అడమ్‌ టోలీని కిందటి ఏడాది నవంబర్‌లో నియమించారు ప్రధాని సునాక్‌. రెండు ఫిర్యాదుల మీద మొదలైన ఈ వ్యవహారంలో దర్యాప్తు.. మలుపులు తీసుకుంటూ ఎక్కడికో పోయింది. రాబ్‌కు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించుకుంటూ పోయింది అడమ్‌ టీం. రాబ్‌ దగ్గర పని చేసే సిబ్బంది నుంచి వాంగ్మూలం సేకరించి నివేదికను సిద్ధం చేసింది. గురువారం ఆ నివేదికను రిషి సునాక్‌కు సమర్పించారు అడమ్‌ టోలీ. ఆ నివేదిక ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది. ఈ లోపే రాబ్‌ అనూహ్యాంగా రాజీనామా ప్రకటించారు.

రాబ్ తన రాజీనామా లేఖలో ఏమన్నారంటే..

తనపై మోపబడిన రెండు ఆరోపణలను మినహాయించి అన్నింటినీ తోసిపుచ్చిందని మరియు ప్రభుత్వ మంత్రులకు ఇది ప్రమాదకరమైన ఉదాహరణగా నిలిచిందని రాబ్ లేఖలో ప్రధాన మంత్రి రిషి సునక్‌కి తెలిపారు.విచారణ ఫలితాన్ని అంగీకరించడం నా బాధ్యతగా భావిస్తున్నప్పటికీ, అది నాకు వ్యతిరేకంగా వచ్చిన రెండు ఆరోపణలను మినహాయించి అన్నింటినీ కొట్టివేసింది” అని ఆయన రాజీనామా లేఖలో రాశారు.దాని రెండు ప్రతికూల ఫలితాలు లోపభూయిష్టంగా ఉన్నాయని మరియు మంచి ప్రభుత్వ ప్రవర్తనకు ప్రమాదకరమైన ఉదాహరణగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను.నేను ఎవరిపైనా అరవలేదని, ఏదైనా విసిరివేయడం లేదా ఎవరినీ శారీరకంగా బెదిరించలేదని లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరినీ తక్కువ చేయడానికి ప్రయత్నించలేదని నివేదిక నిర్ధారించిందని రాబ్ చెప్పారు.

గతంలో బ్రిటన్ విదేశాంగ మంత్రిగా పనిచేసిన రాబ్, సునాక్ మరియు ప్రభుత్వానికి మద్దతుగా ఉంటానని చెప్పారు.మాజీ న్యాయవాది అయిన రాబ్, కరాటే బ్లాక్ బెల్టర్ .తన వద్ద పనిచేస్తున్న సివిల్ సర్వెంట్లను బెదిరింపులకు గురిచేసానన్న ఆరోపణలను ఆయన ఖండించారు.కిందటి ఏడాది అక్టోబర్‌లో రిషి సునాక్‌ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా ఈ ఆరు నెలల కాలంలో ముగ్గురు కేబినెట్‌ మంత్రులు వ్యక్తిగత ప్రవర్తన కారణంగానే పదవుల నుంచి వైదొలగాల్సి రావడం గమనార్హం.

Exit mobile version
Skip to toolbar