Prime9

Pakistan: పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. సైనికుల దుస్తులు విడిపించిన బీఎల్ఏ

Baloch Liberation Army VS Pakistan Army: బలూచిస్తాన్‌లో పాకిస్థాన్ ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు పడ్డాయి. బలూచిస్తాన్ వీడాలని పాక్, చైనాకు బలూచ్ లిబరేషన్ ఆర్మీహెచ్చరికలు జారీ చేసింది. క్వెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకున్న దిశగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తోంది.

 

కాగా, బలూచిస్తాన్‌పై పాకిస్థాన్ నియంత్రణ కోల్పోతోంది. ఇప్పటికే పాక్ సైన్యానికి బలూచిస్తాన్‌లో ఎదురుదెబ్బ తగిలింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చేతికి మంగుచోర్ పట్టణం చిక్కింది. ఈ మేరకు బీఎల్ఏ డత్ స్క్వాడ్ ఎదుట పాక్ సైనికులు లొంగిపోయారు. తాజాగా, బలూచిస్తాన్‌లో పాక్ ఆర్మీకి తీవ్ర అవమానం జరిగింది. పాక్ సైనికుల దుస్తులు విడిపించారు.

 

పాకిస్తాన్ భారత్‌తో యుద్ధం చేయకముందే, బలూచిస్తాన్‌ని కోల్పోయేలా ఉంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ వ్యాప్తంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. పాక్ ప్రభుత్వం, ఆర్మీని టార్గెట్ చేస్తూ బీఎల్ఏ యోధులు విరుచుకుపడుతున్నారు. భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆర్మీ తన బలగాలను ఎల్ఓసీ, భారత్ ఇతర సరిహద్దులకు తరలించింది. దీంతో, బీఎల్ఏ ఫైటర్స్ అక్కడ ఉన్న పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బీఎల్ఏ దెబ్బకు పలువురు పాక్ సైనికులు పలాయనం చిత్తగిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar