Site icon Prime9

Belarus President Lukashenko: పుతిన్ తో సమావేశమయిన వెంటనే ఆసుపత్రిలో చేరిన బెలారస్ అధ్యక్షుడు లుకషాన్కో..

Lukashenko

Lukashenko

Belarus President Lukashenko: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఏకాంతంగా సమావేశం అయిన తర్వాత బెలారస్‌ అధ్యక్షుడు లుకషాన్కో ను హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. లుకషాన్కో ప్రత్యర్థి అయిన వాలెరీ త్సెప్కలో మాట్లాడుతూ బెలారస్‌ ప్రెసిడెంట్‌ను హుటాహుటిన మాస్కోలోని సెంట్రల్‌ క్లినికల్‌ ఆస్పత్రిలో చేర్పించారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. టాప్‌ స్పెషలిస్టుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని చెప్పారు. పుతిన్‌తో క్లోజ్డ్‌ డోర్‌ మీటింగ్‌ తర్వాత ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించిందని ఆయన వివరించారు. ఇదే విషయాన్ని డెయిలీ ఎక్స్‌ప్రెస్‌ కూడా వెల్లడించింది. 68 ఏళ్ల బెలారస్‌ ప్రెసిడెంట్‌ పుతిన్‌తో క్లోజ్‌ డోర్‌ మీటింగ్‌ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వెంటనే మాస్కోలోని సెంట్రల్‌ క్లినికల్‌ ఆస్పత్రికి తరలించారని పేర్కొంది.

విషప్రయోగం జరిగిందని ..(Belarus President Lukashenko)

బెలారస్‌ ప్రెసిడెంట్‌గా లుకషాన్కోతో పోటీ పడిన వాలెరీ త్సెప్కలో గతంలో అమెరికా రాయబారిగా కూడా పనిచేశారు. లుకషాన్కో పరిస్థితి మాత్రం విషమంగా ఉందనిస్పెషలిస్టుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతోందన్నారు. మొత్తానికి ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం సీరియస్‌గానే ఉంది.. బ్లడ్‌ ప్యూరిఫికేషన్‌ ప్రక్రియ జరుగుతోందన్నారు. ప్రస్తుతం ఆయనను ఆస్పత్రి నుంచి తరలించే పరిస్థితి కూడా లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం అధ్యక్షుడిని రక్షించడానికి డాక్టర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎందుకంటే క్రిమ్లెన్‌ ఆయనను విష ప్రయోగం చేసి చంపడానికి ప్రయత్నిస్తోందని ఇప్పటికే ప్రపంచమంతా కోడై కూస్తోంది. దీనితో ఈ అనుమానాలను పటా పంచలు చేయడానికి డాక్టర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

రష్యాకు పెద్ద ఎత్తున సాయం చేసిన లుకషాన్కో..

ప్రస్తుతం లుకషన్కో ఆరోగ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా పలు కథనాలు పుకార్లు వ్యాపిస్తున్నాయి. వాస్తవానికి పుతిన్‌కు అత్యంత సన్నిహిత సహచరుడు బెలారస్‌ ప్రెసిడెంట్‌. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచి పుతిన్‌కు ఆయన అండగా ఉన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి తన సైన్యాన్ని కూడా పంపారు. రష్యాకు సైనికపరంగా పెద్ద ఎత్తున సహాయం చేశాడు లుకషాన్కో. ఈ నెల 9వ తేదీన మాస్కోలో జరిగిన విక్టర్‌ డే సంబరాల్లో కూడా పాల్గొన్నారు. అయితే సంబరాలు ముగియడానికి ముందే ఆయన అక్కడి నుంచి నిష్క్రమించారు. అటు తర్వాత ఆయన చేతికి బ్యాండేజీతో కనిపించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి పట్ల పలు పుకార్లు షికార్లు చేశాయి.

ఇదిలా ఉండగా బెలారస్‌ అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న పుకార్ల గురించి స్పందించడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరించింది. మౌన ముద్ర వహిస్తోంది. కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి కారణం ఏమిటనే అంశం గురించి కూడా ఎలాంటి ప్రకటనల విడుదల చేయలేదు. ఇవన్నీ పరిగణలోని తీసుకుంటే ఆయనపై రష్యన్‌ సీక్రెట్‌ సర్వీసెస్‌ విష ప్రయోగం చేసి ఉంటుందనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

Exit mobile version