Prime9

Muhammad Yunus : యూకేలో మహమ్మద్‌ యూనస్‌కు చేదు అనుభవం

Muhammad Yunus : బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ యూకేలో పర్యటిస్తున్నారు. పర్యటనలోఆయనకు చేదు అనుభవం ఎదురైంది. యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌‌తో సమావేశం కావాలని ప్రయత్నించిన యూనస్‌కు నిరాశే ఎదురైంది.

 

ఈ నెల 13 వరకు మహమ్మద్‌ యూనస్‌ యూకేలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్టార్మర్‌తో సమావేశం అయ్యేందుకు ప్రయత్నించారు. భేటీని కోరుతూ అక్కడి ప్రభుత్వానికి లేఖ రాశారు. బంగ్లాధినేతతో సమావేశానికి స్టార్మర్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3తో భేటీ అయ్యేందుకు యూనస్‌ ప్రయత్నించారు. అది సాధ్యపడలేదు. బంగ్లాదేశ్‌లోని గత పాలకులు దోచుకున్న సొమ్మును విదేశాలకు మళ్లించారని యూనస్ ఆరోపించారు. ఎక్కువ భాగం యూకేకు వచ్చిందని వ్యాఖ్యానించారు.

 

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తిరిగి తీసుకోవడంలో సాయం చేయడం యూకే నైతిక బాధ్యత అని యూనస్ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. తనకు స్టార్మర్‌తో ప్రత్యక్ష చర్చలు జరగలేదన్నారు. తమ ప్రయత్నాలకు స్టార్మర్ కచ్చితంగా మద్దతిస్తారనే నమ్మకం ఉందన్నారు. వచ్చే ఏడాదిలో బంగ్లాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో భాగం కావాలనే ఉద్దేశం, ఆసక్తి తనకు లేదని యూనస్‌ తెలిపారు.

 

గతేడాది బంగ్లాలో అల్లర్లు చెలరేగడంతో ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె దేశం విడిచి భారత్‌‌లో తలదాచుకున్నారు. తర్వాత సైన్యం మద్దతుతో యూనస్‌ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం అధికారం చేపట్టింది.

Exit mobile version
Skip to toolbar