Site icon Prime9

Nepal: నేపాల్ లో ఆదిపురుష్ సినిమా ప్రదర్శనలపై నిషేధం.. ఎందుకో తెలుసా?

adipurush movie

adipurush movie

Nepal: ఆదిపురుష్‌ సినిమా ఇటీవల ఇండియాలో విడుదలైంది. సినిమా విడుదలైనప్పటి నుంచి ఏదో వివాదం వెంటాడుతూనే ఉంది. కలెక్షన్ల పరంగా సినిమా బాగానే డబ్బు వసూళ్లు చేస్తోంది. ఇండియా సంగతి పక్కనపెడితే పొరుగున ఉన్న నేపాల్‌ మాత్రం ఆదిపురుష్‌ సినిమాలోని డైలాగ్‌ల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉంది. వెంటనే నేపాల్‌తో పాటు పర్యాటక ప్రదేశమైన ఫోఖారాలో సోమవారం నుంచి హిందీ సినిమాల ప్రదర్శనను నిలిపివేసింది. ఇంతకు సినిమా నేపాలీలకు ఎందుకు ఆగ్రహం తెప్పించింది అంటే ఈ సినిమాలో సీత భారత్‌ బిడ్డ అనే డైలాగ్‌ ఉంది. దీంతో దేశం మొత్తం భారత్‌పై మండిపడుతోంది. సీత నేపాల్‌ లో జన్మించారని వారి వాదన. దీంతో ఖాట్మాండులోని మొత్తం 17 సినిమా హాళ్ల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సినిమా థియేటర్లలో ఎక్కడ హిందీ సినిమా ప్రదర్శించకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.

వివాదాస్పదంగా మారిన డైలాగ్..(Nepal)

ఖాట్మాండు మేయర్‌ బాలేంద్ర షా ఆదివారం నాడు మీడియాలో మాట్లాడుతూ.. ఖాట్మాండు మెట్రోపాలిటన్‌ నగరంలో ఎక్కడా హిందీ సినిమాలు ఆడటానికి వీల్లేదన్నారు. ఆదిపురుష్‌ సినిమాలోని ‘జానకి భారత్‌ కూతరు” అనే డైలాగ్‌ తీసేసే వరకు హిందీ సినిమాలను ఇక్కడ ప్రదర్శించబోనివ్వమని ఆయన స్పష్టం చేశారు. తాజాగా రామాయణ గాథను ఆదిపురుష్‌ పేరుతో ఓమ్‌ రౌత్‌ తెలుగు సినీ హీరో ప్రభాస్‌, కీర్తి సనన్‌లతో నిర్మించారు. రాముడు, సీత పాత్రలలో వీరిద్దరు నటించారు. ప్రస్తుతం నేపాల్‌తో పాటు ఇండియాలో సినిమా ప్రదర్శనను నిలిపివేశారని బాలేంద్ర అన్నారు. సినిమాలో డైలాగ్‌ తీసేయలేదంటే తమకు కోలుకోలేని డ్యామేజీ అవుతుందని ఖాట్మాడు మేయర్‌ అన్నారు. అలాగే ఫోఖారా మేయర్‌ ధన్‌రాజ్‌ ఆచార్య కూడా సోమవారం నుంచి ఆదిపురుష్‌ సినిమాను ఆడనివ్వమని ఆయన స్పష్టం చేశారు.

సీత ఇక్కడే పుట్టిందని..

ఇక నేపాల్‌ విషయానికి వస్తే ఇక్కడి జనాభాలో 80 శాతం ప్రజలు హిందువులే. ఇక్కడి వారి నమ్మకం ఏమిటంటే సీత నేపాల్‌లోని జనక్‌పూరి జన్మించారని..మిథిలా రాజ్యంలో రాజశ్రీ జనక్‌ పాలనలో సీత జన్మించారని వారి నమ్మకం. ఇక్కడ సీతను జానకిగా గుర్తిస్తారు. ఎందుకంటే రాజు జనక్‌ సీతను దత్తత తీసుకొని పెంచారని నేపాల్‌ ప్రజలు నమ్ముతారు. ఇక్కడి జనకపూర్‌లో సీత పుట్టిన ఊరులో ప్రత్యేకంగా జానకి దేవాలయం నిర్మించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా హిందువులు సీతను దేవతగా కొలుస్తారు. అయితే భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2018లో నేపాల్‌ పర్యటనకు వెళ్లారు. అప్పుడు ఆయన కూడా జానకి దేవాలయాన్ని సందర్శించారు. అలాగే ఆయన అయోధ్య – జనక్‌పూరి బస్సు సర్వీసును కూడా ప్రారంభించారు. రెండు నగరాలకు భక్తులను కలుపుతూ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. కాగా జనక్‌పూరి విషయానికి వస్తే సీత పుట్టిన ప్రదేశం కాకుండా .. రాముల వారు సీతను వివాహం చేసుకోవడానికి శివ ధనుస్సును ఇక్కడే విరిచారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

ఇక ఆదిపురుష్‌ సినిమాకు సంబంధించి వివాదాలు వెల్లువెత్తడంతో ఆదిపురుష్‌ సినిమా డైలాగ్‌ రైటర్‌ మనోజ్‌ ముంతషైర్‌ శుక్లా ఆదివారం నాడు స్పందించారు. సినిమా నిర్మాతలు తాను రాసిన కొన్ని డైలాగ్‌లను సవరించారని చెప్పారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిర్మాతలు కొన్ని డైలాగ్‌లు మార్చాల్సి వచ్చిందన్నారు డైలాగ్‌ రైటర్‌. కాగా శుక్లా హిందీ డైలాగ్‌లతో పాటు కొన్ని పాటలు రాశారు. ఈ వారంలోనే కొన్ని డైలాగ్‌లు మార్చే అవకాశం ఉందన్నారు శుక్లా.

Exit mobile version