Baloch Liberation Army Attack in Pakistan: పాకిస్థాన్‌లో మరోసారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడికి పాల్పడింది. మస్తుంగ్ పోలీస్ స్టేషన్‌పై బీఎల్‌ఏ దాడి చేసింది. ఈ మేరకు స్టేషన్‌లోని ఆయుధాలను మిలిటెంట్లు ఎత్తుకెళ్లారు. పాకిస్థాన్ ఆర్మీ, పోలీసులే లక్ష్యంగా దాడులు చోటుచేసుకున్నాయి. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజక్ చేసి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో దాదాపు 214 మంది భద్రతా సిబ్బందిని మిలిటెంట్లు, 30 మంది పాక్ ఆర్మీ సైనికులను చంపినట్లు వెలువడిన ప్రకటనతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది.
ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో జాఫర్ రైలును హైజాక్ ఘటన కలకలం రేపింది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో దాదాపు 27 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దీంతో పంజాబ్, సింధ్ ప్రాంతాల నుంచి బలోచిస్థాన్ వెళ్లే రైళ్లను రద్దు చేసినట్లు పాకిస్థాన్ రైల్వే శాఖ తెలిపింది.