Prime9

Plane Skip: తప్పిన మరో విమాన ప్రమాదం.. ప్రయాణికులంతా సేఫ్

Boston: మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఘటన మరిచిపోక ముందే మరో విమానం త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని బోస్టన్ లో ఇవాళ జరిగింది.

అమెరికాలోని బోస్టన్ లో లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్ వే పై ఓ విమానం అదుపుతప్పింది. రన్ వే నుంచి జారి పక్కకు దూసుకుపోయింది. ఘటనలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు విమానం అదుపుతప్పిన సమయంలో ఎలాంటి ప్రమాదకర వస్తువులు లేకపోవడంతో పెను ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా జెట్ బ్లూ సంస్థకు చెందిన 312 విమానం చికాగో నుంచి బోస్టన్ లోని లోగాన్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో రన్ వే మీద దిగుతుండగా అదుపుతప్పింది. వేగంగా జారీ పక్కకు దూసుకెళ్లింది. పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనపై జెట్ బ్లూ సంస్థ స్పందించింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించింది. విమానం రన్ వే పై ల్యాండ్ అయిన తర్వాత పక్కకు జరిగిందని చెప్పారు.

 

Exit mobile version
Skip to toolbar