Site icon Prime9

EarthQuake : మయన్మార్‌లో మళ్లీ భారీ భూకంపం

EarthQuake

EarthQuake

EarthQuake : మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీన్ని తీవ్రత 5.1గా నమోదైంది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరం మాండలే సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదించింది. వెంటనే సహాయక బృందాలు స్పందించాయి. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను బయటకు తీస్తున్నారు. శుక్రవారం సంభవించిన భారీ భూకంపం సంభవించింది. దీంతో రోడ్లు, వంతెనలు, కమ్యూకేషన్ వ్యవస్థ దెబ్బతిన్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.

 

 

శుక్రవారం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 1600మంది మృతిచెందారు. 3,400 మందికిపైగా అదృశ్యమయ్యారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శనివారం ఉదయం 11.53 గంటల సమయంలో 4.3 తీవ్రతతో, మధ్యాహ్నం 2.30 గంటలకు 3.8తీవ్రతతో, 20 నిమిషాల వ్యవధిలో 4.7 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు భూకంపన వైజ్ఞానిక కేంద్రాలు వెల్లడించాయి. ఇవాళ మరోసారి భూకంపం రావటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

 

 

భూకంపం వల్ల థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఆకాశహర్మ్యం కుప్పకూలిన ఘటనలో అక్కడ పనిచేస్తున్న వారిలో 78 మంది కార్మికుల జాడ ఇంకా తెలియరాలేదు. భూకంపం వల్ల నగరంలో చనిపోయిన మరో 10 మందిని శనివారం గుర్తించారు. భారీగా ఉన్న శిథిలాలను తొలగించడానికి శక్తిమంతమైన యంత్రాలను వినియోగిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar