Site icon Prime9

Plane Hijack : అమెరికాలోని బెలిజ్‌లో షాకింగ్‌ ఘటన.. కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు యత్నం

Plane Hijack

Plane Hijack

Plane Hijack : అగ్రరాజ్యం అమెరికాలోని బెలిజ్‌‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. విమానం గగనతలంలో ఉండగా, ఓ ప్రయాణికుడు హైజాక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికుడు కాల్పులు జరపగా, దీంతో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

న్యూయార్క్‌ పోస్ట్‌ నివేదిక ప్రకారం..
ట్రాఫిక్‌ ఎయిర్‌‌కు చెందిన ఓ చిన్న ఫ్లైట్ గురువారం కొరొజాల్‌ నుంచి శాన్‌ పెడ్రోకు వెళ్తోంది. విమానం కొరొజాల్‌ విమానాశ్రయంలో టేకాఫ్‌ తీసుకుంది. విమానం గగనతలంలోకి ఎగిరిన కొద్దిసేపటికే అందులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు కత్తితో విమానంలోని ప్రయాణికులను బెదిరించాడు. ఈ క్రమంలోనే విమానం హైజాక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కొందరు ప్రయాణికులను గాయపరిచాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఓ ప్రయాణికుడు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ తుపాకీతో కాల్పులు జరుపగా, నిందితుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

విమానంలో 14 మంది ప్రయాణికులు..
ప్రమాద జరిగిన సమయంలో విమానంలో 14 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ నివేదించింది. నిందితుడిని అమెరికా పౌరుడు (49), అకిన్యేలా సావా టేలర్‌గా గుర్తించారు. ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెలిజ్‌ పోలీసు కమిషనర్‌ చెస్టర్‌ విలియమ్స్‌ తెలిపారు. నిందితుడు విమానంలోకి కత్తిని ఎలా తీసుకువచ్చాడని అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నిందితుడిని కాల్చి చంపిన ప్రయాణికుడిని కమిషనర్‌ విలియమ్స్‌ ప్రశంసించారు.

 

 

Exit mobile version
Skip to toolbar