Site icon Prime9

10 Days Old Baby: మృత్యువును జయించిన10 రోజుల చిన్నారి.. 90 గంటలపాటు శిథిలాల కిందే

10 days old baby

10 days old baby

10 Days Old Baby: ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ దేశాల్లో అంతులేని విషాదం నెలకొంది. పెను విలయం సృష్టించిన ఈ భూకంపం.. సుమారు 25వేల మంది ప్రాణాలను బలిగొంది. భూకంపం అనంతరం.. ఎటు చూసిన కూలిన బిల్డింగులు.. శవాల దిబ్బలే కనిపించాయి. ఈ భూకంపం అనంతరం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. సహాయక చర్యల్లో భాగంగా.. పదో రోజులు నవజాత శిశువు ప్రాణాలతో నిలిచింది. సుమారు 90 గంటల పాటు ఆ చిన్నారి  శిథిలాలే కిందే ఉంది. ఆ చిన్నారిని వైద్యులు రక్షించారు.

భారీ భూకంపం.. ఆస్తి, ప్రాణ నష్టం

భారీ భూకంపం తర్వాత టర్కీ, సిరియాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి విలయానికి ఈ రెండు దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. వరుస భూకంపాల తర్వాత భవన శిథిలాల గుట్టలుగా పేరుకుపోయాయి. ఆ భయానక దృశ్యాలు ఇప్పటికి ఆ దేశ ప్రజల ముందు మెదులుతున్నాయి. ఈ ప్రళయంలో రోజులు గడుస్తున్న కొద్దీ.. మరణాల సంఖ్య పెరుగుతూ పోతోంది.ఇప్పటికే ఈ సంఖ్య 25వేలు దాటినట్లు అధికారులు తెలిపారు. ఒక్క టర్కీలోనే సుమారు 20 వేల మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.

మృత్యుంజయురాలిగా బయటపడిన చిన్నారి..(10 Days Old Baby)

టర్కీలో శిథిలాలను తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కరోజే వందకు పైగా బాధితులు ప్రాణాలతో బయట పడ్డారు. తాజాగా హతయ్‌ ప్రావిన్సులో శిథిలాల కింద చిక్కుకున్న ఓ మహిళ, నవజాత శిశువును బయటకు తీశారు. సుమారు నాలుగు రోజులు కావస్తున్న వారిద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. భూకంపం అనంతరం 90 గంటల తర్వాత ఇద్దరు ప్రాణాలతో సురక్షితంగా ఉన్నారు. 10రోజుల చిన్నారితో సహా.. తల్లిని అధికారులు రక్షించారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు.

ఆ చిన్నారి నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి మరణాన్ని జయించింది. మరింత మెరుగైన చికిత్స కోసం.. హతే ప్రావిన్స్‌లోని ఆస్పత్రికి అధికారులు తరలించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డకు చికిత్స అందిస్తున్నారు. ఇదే హతే ప్రావిన్స్‌లో మూడేళ్లు ఉన్న చిన్నారి సైతం ప్రాణాలతో బయటపడింది. శిథిలాల కింద మరింత మంది ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు..

భారీ ప్రళయం అనంతరం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. వీటితో పాటు.. శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భీకర భూకంపం సంభవించి 100 గంటలు గడిచిపోయిన శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. తమ వారిని కోల్పోయిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కొందరు సజీవంగా బయటపడటం ఊరట కలిగిస్తోంది.

Exit mobile version