Site icon Prime9

Children Killed: థాయిలాండ్ లో ఘోరం.. 32 మందిని పొట్టనపెట్టుకున్న కిరాతకుడు

32 killed in Thailand school incident

32 killed in Thailand school incident

Thailand: థాయిలాండ్ లో చోటుచేసుకొన్న ఓ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 32కు చేరుకొంది. ఓ మాజీ పోలీసు అధికారి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అంతర్జాతీయ మీడియా కథనాల సమాచారం మేరకు, థాయ్ లాండ్ లోని ఈశాన్య ప్రావిన్స్ లో ఓ పిల్లల డే కేర్ సెంటర్ ఉంది. దీనిపై పాన్య కమ్రాబ్ అనే వ్యక్తి మారణాయుధాలతో దాడి చేశాడు. ఎదురుగా కనపడిన వారందరిని తన వద్ద ఉన్న తుపాకీతో నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు. ఘటనలో తొలుత 31మంది చనిపోగా అనంతరం ఆ సంఖ్య 32కు చేరుకొనిందని పోలీసులు ధృవీకరించారు. మృతుల్లో 23మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

దాడికి పాల్పొడిన వ్యక్తి ఓ మాజీ పోలీసు అధికారిగా గుర్తించారు. మరో వైపు రెండు కథనాలు వినిపించాయి. ఘటనకు పాల్పొడిన వ్యక్తి తన భార్యా పిల్లలను కాల్చి చంపి, తనుకూడ చనిపోయిన్నట్లు థాయిలాండ్ మీడియా పేర్కొనింది. కానీ పోలీసుల మాత్రం హంతకుడు ఘటన అనంతరం ఓ తెల్లటి వాహనం ద్వారా పరారైన్నట్లు పేర్కొన్నారు. గాలింపు చర్యలు కూడా ప్రారంభించిన్నట్లు వారు పేర్కొన్నారు.

థాయిలాండ్ లో గన్ సంస్కృతి ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. అయితే అధికారికంగా పౌరుల వద్ద తుపాకీలు ఉన్నట్లు పోలీసులు రికార్డుల్లో పెద్దగా లేవు. చాలా వరకు అక్రమంగా పోరస్ ప్రాంతం నుండి గన్ విక్రయాలు సాగుతున్నట్లు తెలుస్తుంది. 2020లో జరిగిన ఓ ఘటనలో కోపంతో ఓ సైనికుడు 29 మందిని చంపేశాడు. అనంతరం తాజాగా చోటుచేసుకొన్న ఘటనతో థాయిలాండ్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఇది కూడా చదవండి:Cough Syrup Death: దగ్గు, జలుబు సిరప్​ల కారణంగా 66 మంది చిన్నారులు మృతి

Exit mobile version