Site icon Prime9

Tips to Stay fit in Summer: సమ్మర్‌లోనూ ఫిట్‌గా ఉండాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి!

Summer Tips

Summer Tips

Tips to Stay Fit in Summer: వాతావరణం ఏదైనా ప్రతీ సీజన్‌లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. వాతావరణంలో మార్పులకు అణుగుణంగా తినే ఆహారం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం అవసరం. ముఖ్యంగా సమ్మర్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సీజన్‌లో జనం డీహైడ్రేషన్, జీర్ణ సంబంధిత సమస్యలు, వడదెబ్బ వంటి బారిన పడుతుంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల టిప్స్ తప్పకుండా పాటించాలి. ఇవి మండుటెండల్లో కూడా మీరు చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

 

కొబ్బరి నీళ్లు:
వేసవిల్లో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ సీజన్‌లో కూల్ డ్రింక్స్‌కు బదులుగా మజ్జిగ, షర్బత్ వంటివి తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇవి మీ దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరంలోని ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా మీరు డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి.

 

చల్లదనాన్నిచ్చే ఆహారాలు:
వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు మార్కెట్ లో పుష్కలంగా లభిస్తాయి. దోసకాయ, పుచ్చకాయ, పుదీనా వంటి ఆహారాలను ఎక్కువగా తినాలి. ఇవి మీ శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా గ్యాస్, వడదెబ్బ వంటి సమస్యల నుండి దూరంగా ఉంచుతాయి.

 

వాకింగ్:
సమ్మర్ లో భారీ వ్యాయామాలకు బదులుగా, యోగా చేయండి. ఉదయాన్నే లేదా సాయంత్రం కాసేపు నడవండి. అంతే కాకుండా సులభమైన వ్యాయామాలు చేయండి. ఇవి మీ శరీరం వేడెక్కకుండా చేస్తాయి. అంతే కాకుండా మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడతాయి.

 

సహజ డ్రింక్స్:
వేడిని తట్టుకోవడానికి గంధపు పేస్ట్, కలబంద జెల్ లేదా రోజ్ వాటర్ ను చర్మంపై అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల శరీరం సహజంగానే చల్లబడుతుంది. వేప ఆకులు వేసిన నీటితో స్నానం చేయడం వల్ల మీ చర్మం రిఫ్రెష్ అవుతుంది. అంతే కాకుండా వేసవిలో వచ్చే దద్దుర్ల నుండి ఉపశమనం లభిస్తుంది.

 

మంచి నిద్ర:
ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి తీసుకుంటే.. మీ శరీరం కూడా ఫిట్‌గా ఉంటుంది. రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొని ఉండటం సరికాదు. బదులుగా రోజూ కనీసం 7-8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. రాత్రిపూట మంచి నిద్ర కోసం కాటన్ దుప్పట్లపై పడుకోవాలి.

 

కారంగా, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలు:
బాగా వేయించిన, కారంగా ఉండే ఆహారాలు శరీరంలో వేడిని పెంచుతాయి. దీనివల్ల అజీర్ణ , నిర్జలీకరణం జరుగుతుంది. అందుకే వీటికి బదులుగా.. పప్పు, బియ్యం, తాజా కూరగాయలతో ఇంట్లో వండిన భోజనాన్ని తినండి.

 

హోం రెమెడీస్:
ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం కలిపి తాగడం, ఒక చెంచా నానబెట్టిన మెంతులు తినడం లేదా త్రిఫల చూర్ణం తినడం వల్ల వేసవి కాలంలో మీ అంతర్గత వ్యవస్థ శుభ్రపడుతుంది. ఫలితంగా మీ జీర్ణక్రియ బలంగా ఉంటుంది.

 

తేలికైన దుస్తులు ధరించండి:
వేడిని నివారించడానికి వదులుగా, కాటన్ , లేత రంగు దుస్తులను ధరించండి. వడదెబ్బను నివారించడానికి.. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ తలని స్కార్ఫ్ లేదా క్యాప్ తో కవర్ చేసుకోండి.

 

 

Exit mobile version
Skip to toolbar