Site icon Prime9

PCOS and Diabetes: పిసిఒఎస్ కు డయాబెటిస్ కు సంబంధం వుందా?

PCOS and Diabetes: పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), మహిళల్లో హార్మోన్ల రుగ్మత, ఇది చిన్న తిత్తులతో విస్తరించిన అండాశయాలకు కారణమవుతుంది. దీనివలన అధిక రక్తపోటు, గుండె మరియు రక్తనాళాల సమస్యలు మరియు గర్భాశయ క్యాన్సర్ కు గురయ్యే అవకాశముంది. పిసిఒఎస్ ఉన్న స్త్రీలు గర్బం దాల్చడానికి సమస్యలను ఎదుర్కొంటారు. మరోవైపు పిసిఒఎస్ ఉన్న మహిళలు టైప్ 2 డయాబెటిస్‌కు గురవుతారని కూడ అధ్యయనాలు తెలుపుతున్నాయి.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, పిసిఒఎస్ ఉన్న మహిళలు తరచుగా ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటారు; వారి శరీరాలు ఇన్సులిన్‌ను తయారు చేయగలవు, కానీ దానిని సమర్థవంతంగా ఉపయోగించలేవు, టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అదేవిధంగా, యాపిల్ మరియు హార్వర్డ్ చేత ‘ఉమెన్స్ హెల్త్ స్టడీ’ పేరుతో ఇటీవలి అధ్యయనం కూడా పిసిఒఎస్ ఉన్న స్త్రీలకు ప్రీ-డయాబెటిక్ పరిస్థితులు వచ్చే అవకాశం దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ మరియు టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ అని సూచించింది. మెటబాలిక్ సిండ్రోమ్ అని పిలువబడే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా పిసిఒఎస్ మరియు మధుమేహం పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. పిసిఒఎస్ మహిళల ఎండోక్రైన్ వ్యవస్థకు భంగం కలిగిస్తుంది.

ఎవరికి ఎక్కువ ప్రమాదం..
స్థూలకాయులు
మధుమేహం వంశపారంపర్యంగా వున్నవారు
అనారోగ్యకరమైన జీవనశైలి
వ్యాయామం చేయని వ్యక్తులు
నిరంతరం ఒత్తిడికి గురయ్యేవారు
వీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిన అవసరం వుంది.

పిసిఒఎస్ ఉన్న మహిళలు క్రింది జీవనశైలి చిట్కాలను గుర్తుంచుకోవాలి..
బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి
ఒత్తిడిని అదుపులో వుంచుకోవాలి.
రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి
మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి.

ఇలా చేసినట్లయితే మధుమేహాన్ని నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు

Exit mobile version