Mood Food: ప్రస్తుతం ఉండే బిజీ లైఫ్ తో నిమిషానికి ఒక మూడ్ మారడం సహజమైపోయింది. చాలామందిలో ఈ మూడ్ స్వింగ్స్ తరుచూ మారుతూ ఉంటాయి. అయితే మనం తీసుకునే ఆహారం వల్ల ఆ మూడ్ ను సెట్ చేసుకోవచ్చు. అందుకు కారణం ఎండోర్ఫిన్ అనే హార్మోన్. మరి ఇది కొన్ని ఆహార పదార్థాలతో కూడా దొరుకుందని చెబుతున్నారు నిపుణులు. తీసుకునే ఆహారానికి మన మూడ్ మధ్య రిలేషన్ ఉండటమే దీనికి కారణం. కాబట్టి పోషకాహారం, సరైన ఆహారం తీసుకోవడం వల్ల మూడ్ చేంజ్ చేసుకోవచ్చు. అందుకోసం తప్పనిసరిగా రోజూ వారి ఆహారంలో ఈ పదార్థాలను చేర్చుకోవాలంటున్నారు నిపుఫులు. మరి ఆలస్యమెందుకు అవేంటో చూద్దాం.
నట్స్ అండ్ సీడ్స్
మన శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. కానీ ఇది మన శరీరంలో ఉత్పత్తి కావు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల అధిక స్థాయి డిప్రెషన్‌కు దారితీస్తుంది. మనసును ఉత్తేజపరచడానికి ఇవి చాలా ముఖ్యం. అయితే డ్రై ఫ్రూట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే నట్స్ మానసిక స్థితిని పెంచే ఆహార పదార్థాలు. ఈ నట్స్ లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది అమైనో యాసిడ్. మూడ్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువడా గుమ్మడి గింజలు, నువ్వులు, సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఎక్కువగా ఉంటుంది.
అరటిపండులో ఫైబర్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది విటమిన్ B6ను కలిగి ఉంటుంది. ఇది మెరుగైన అభిజ్ఞా ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది అంటే ఇది మెదడులోని అభిజ్ఞా భాగాన్ని సక్రియం చేస్తుంది.
సిట్రస్ జాతిలో..
నిమ్మకాయ సిట్రస్ పండు. మానసిక స్థితిని మెరుగుపరచడానికి విటమిన్ సి చాలా ముఖ్యం. నిమ్మకాయ, కొంచెం నీరు, పుదీనా ఆకులతో కలిపి తీసుకుంటే తక్షణ శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది. మానసిక స్థితిని రిఫ్రెష్ చేస్తుంది.
బెర్రీస్ ఎక్కువగా తీసుకోవడ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. బ్లూబెర్రీ సిట్రస్ జాతికి చెందినది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి మానసిక స్థితిని మెరుగుపరచడం, జ్ఞాపకశక్తిని పెరుగుదలతో సహాయ పడతాయి. బ్లూబెర్రీస్ లో కూడా యాంటీ ఇన్ ప్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అనేక మానసిక రుగ్మతలు మెరుగుపడతాయి.
ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్(Mood Food)
సాల్మన్‌లో పిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఈ సాల్మన్ మూడ్‌ని ఇంక్రీజ్ చేయడానికి బాగా సహాయ పడుతుంది. వీటి వల్ల మన జుట్టు మరియు స్కిన్ కూడా షైనీ గా ఉంటుంది. అదే విధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కూడా సాల్మన్ బాగా ఉపయోగ పడుతుంది. సాల్మన్‌ని కనుక రెగ్యులర్ డైట్‌లో తీసుకునే వాళ్లు ఆహ్లాదకరంగా ఉంటారు. డిప్రెషన్ కు కూడా ఏ మాత్రం ఉండదు. ఎలాంటి మానసిక ఒత్తిడి, మానసిక సమస్యలు దరిచేరవు.
బచ్చలి కూరలో మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది సెరోటోనిన్ లెవెల్స్‌ని పెంపొందిస్తుంది. తద్వారా మూడ్ కూడా బాగుంటుంది. శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉన్నా డిప్రెషన్ లాంటి సమస్యలు వస్తాయి. అదే విధంగా అవసరమైన అమైనో యాసిడ్స్‌ని తీసుకోవడం వల్ల కూడా మూడ్ బాగుంటుంది. ఆనందంగా ఉండటానికి అశ్వగంధ, మిరియాలు, మిర్చి కూడా బాగా సహాయపడుతాయి.